Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారును వేధిస్తోన్న జెండా కష్టాలు
By: Tupaki Desk | 12 Aug 2016 7:19 AM GMT తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు ఎంత భారీగా ఉంటాయో అందరికి తెలిసిందే. ఆయన చేసే ఆలోచనలు వినూత్నంగా.. మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. తాను అనుకున్నది అనుకున్నట్లే జరగాలన్న పంతం కూడా ఆయనకు ఎక్కువే. ఆయన కానీ ఒక్కసారి డిసైడ్ అయితే.. ఆ ఇష్యూలో వెనక్కి తగ్గటం అన్నది ఉండదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లుంబినీ పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటం.. ఆఘమేఘాల మీద అందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేయించటం తెలిసిందే.
ఈ భారీ జెండా ఏర్పాటు ఆలోచన విన్న వెంటనే అధికారులు మొదలుకొని అధికారపక్ష నేతలంతా విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురయ్యారు. ఇలాంటి భారీ ఆలోచనలు తమ ముఖ్యమంత్రికి మాత్రమే వస్తాయన్న గొప్పలు చెప్పుకున్నారు. అయితే.. అనుకున్నది ఒక్కటి.. అయినది మరొకటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. జెండా ఏర్పాటు వరకూ అన్ని అనుకున్నట్లే సాగినా.. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఎత్తుగా నిర్మించిన స్తంభం మీద భారీ జెండా ఏర్పాటు చేసినంత వరకూ బాగానే ఉన్నా.. బలంగా వీచే గాలులకు తరచూ జెండా చిరిగిపోతున్న పరిస్థితి. దీంతో.. ఒకటి తర్వాత ఒకటిగా జెండాల్ని వాడేశారు. రిజర్వ్ గా పెట్టుకున్న మూడు జెండాలు వారాల వ్యవధిలో చిరిగిపోవటంతో షాక్ తిన్న అధికారులు.. జెండాను ప్రత్యేక దారంతోతయారుచేసేలా ప్లాన్ చేశారు. ఇది కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. జెండాలు చిరిగిపోతుండటంతో కొన్ని రోజులైతే జెండా లేకుండా అలానే ఉంచేశారు. అలా ఉంచటం తప్పేం కాదని.. జాతీయజెండాను అవమానించినట్లు కాదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న అధికారులు జెండా తయారీపై ఫోకస్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అటు అధికారులకు.. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి జెండా కష్టాలు తీరని దుస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ కు చెందిన చానల్ గ్రూప్ ఇంటర్నేషనల్ నుంచి జెండాను కొనుగోలు చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు.దుబాయ్ లో తయారు చేయిస్తున్న కొత్త జెండా ఒక్కొక్కటి రూ.3.2 లక్షలు అవుతుందని చెబుతున్నారు. తొలుత రూ.1.5లక్షలుగా అంచనా వేసుకున్న జెండా ఖర్చు భారీగా పెరిగిపోవటం ఒకటైతే.. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జెండా చిరిగిపోవటంతో జెండా బాధ్యతలు చేపట్టిన అధికారులకు కంటి నిండా కనుకు తీయలేని పరిస్థితి. మరోవైపు.. ఈ జెండా వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. దుబాయ్ జెండాతో అయినా కేసీఆర్ సర్కారు కష్టాలు తీరుతాయేమో చూడాలి.