Begin typing your search above and press return to search.
ఆర్భాటానికి అసలు కారణం.. అప్పులేనా?
By: Tupaki Desk | 13 April 2015 4:18 AM GMTతెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే.. ప్రస్తావిస్తుంటారు. మిగులుతో రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆర్థిక క్రమశిక్షణ.. ఆర్థికాంశాల్లో ముందు చూపు లోపించటం.. లాంటి అంశాల పుణ్యమా అని తెలంగాణను అప్పుల కుప్పలా మార్చేస్తుంది. ఆర్భాటం చేపడుతున్న కార్యక్రమాలకు నిధులను అప్పుల రూపంలో తీసుకొచ్చేందుకు పెద్దఎత్తున ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
జేబులో రూపాయి ఉంటే.. ఆ రూపాయికి సరిపడా ఖర్చులు చేస్తే బాగానే ఉంటుంది. కానీ.. ఉన్నది రూపాయి అయితే.. ఖర్చు చేసేది రెండు రూపాయిలు అన్న చందంగా మారింది. దీంతో.. అప్పుల భారం తెలంగాణ రాష్ట్రానికి రోజురోజుకీ పెరిగిపోతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో ఆస్తులు.. అప్పులు ఎవరికి ఎన్ని అన్నది తేల్చారు. ఈ సందర్భంగా తెలంగాణరాష్ట్రానికి రూ.71వేల వరకు అప్పులు వచ్చాయి. అయితే.. పూర్తిస్థాయి గణాంకాలు అందుబాటులోకి వస్తే ఈ అప్పుల మొత్తం రూ.81వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక మిగులు ఉన్నప్పటికీ.. పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టటంతో పాటు.. ఆర్థికభారాన్ని పెంచే పథకాల విషయంల తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గటం తర్వాత.. చెలరేగిపోయి మరీ ప్రకటనలు చేస్తోంది. ప్రకటనలు చేయగానే సరిపోదు కదా.. అందుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేసుకోవాలి కదా. ఆదాయం అంతంతమాత్రంగా వస్తున్న నేపథ్యంలో.. బండి నడవటానికి అప్పుల మీద ఆధారపడటం ఒక అలవాటుగా మారింది.
తమది ధనిక రాష్ట్రమని గొప్పగా ప్రకటించుకుంటున్న కేసీఆర్.. నిజంగా అంత డబ్బులే ఉంటే ఏడాదికేడాది అప్పులు భారీగా ఎందుకు తెస్తున్నట్లు? అన్న ప్రశ్న సంధించొచ్చు. దీనికి ఆయన చాలానే కారణాలు చూపించొచ్చు. లేదంటే.. పిచ్చోడ్ని చూసినట్లు చూడొచ్చు. కానీ.. ఎంత అద్భుతమైన పనులు చేస్తున్నా.. రుణభార పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి సర్కారు మీద ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
14వ ఆర్థిక సంఘం తెలంగాణను ధనిక రాష్ట్రంగా పేర్కొనటం.. దానికి కేసీఆర్ సంతోషంతో జబ్బలు చరుచుకోవటం చూసిన తెలంగాణ ప్రజానీకానికి మతి పోతుంది. డబ్బులున్న రాష్ట్రంలో పేదల బతుకులేందన్న ప్రశ్నకు సమాధానం లేదు. మరోవైపు ధనిక రాష్ట్రంగా పేరొందిన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులలో కోత పడనుంది. మొత్తంగా చూస్తే ధనిక రాష్ట్రమన్న పేరు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసేదే.
ఇక.. అప్పుల సంగతికి వస్తే.. మొదటి ఏడాది రూ.8500కోట్లు అప్పు చేసిన తెలంగాణ సర్కారు.. ఈ ఏడాది దాదాపు రూ.18,962కోట్ల అప్పు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం బడ్జెట్ నిర్వహణకు సంబంధించి ఎఫ్‌ఆర్‌బీఎం రూల్స్‌ని మార్చాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ధనిక రాష్ట్రం.. డబ్బులున్న రాష్ట్రం.. అప్పుల కోసం అంతగా తహతహలాడాల్సిన అవసరం ఏమిటో..? అర్థం కాదు.
తెలంగాణ రాష్ట్రం అనుకున్నట్లుగా నిబంధనలు సడలించేలా చేసుకొని.. కొత్త అప్పు తీసుకొస్తే రాష్ట్ర సర్కారు అప్పు లక్ష కోట్ల రూపాయిల ఫిగర్‌ను టచ్ చేస్తుందంటున్నారు. అప్పుల భారంతో పాటు.. వడ్డీల జోరు కూడా పెరుగుతుందన్న విషయం మర్చిపోకూడదు. ధనికరాష్ట్రానికి భారీ అప్పు ఉన్నట్లుందే. మరి.. దీని గురించి ఎవరు గొప్పలు చెప్పుకుంటారో..?