Begin typing your search above and press return to search.
టీ సారథులకు మాత్రం జీతాల్లేవంట
By: Tupaki Desk | 11 Aug 2015 4:51 AM GMTతెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. తెలంగాణ సర్కారు సాంస్కృతిక సారథులన్న పేరుతో ఉద్యోగాలు ఇవ్వటం తెలిసిందే. రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతుల వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగానే మారింది.
అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సుల కారణంగా దీనిపై వచ్చిన విమర్శల్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. తాజాగా ఈ సాంస్కృతిక సారథులకు ఇవ్వాల్సిన జీతాల విషయం ఇప్పుడు వివాదంగా మారింది. ఎందుకంటే.. సారథులుగా నియమించే సమయంలో.. ‘‘మీరంతా గ్రూప్ 1 కేడర్ ఉద్యోగం. నెలకు రూ.27వేల జీతం’’ అని ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటతో సంబరపడిపోయిన వారికి.. జీతాలు మాత్రం మూణ్నాళ్ల ముచ్చటగా మారిందంటున్నారు. కొందరికి నెల జీతం.. మరికొందరికి అందులో సగం జీతం వస్తే.. ఇంకొందరికి మాత్రం అది కూడా రాలేదంటున్నారు.
పేరుకు సారథులైనా.. జీతాలు రాక అప్పులతోకాలం గడపాల్సి వస్తోందని చెబుతున్నారు. జీతాల విషయంపై అడిగితే.. సమాధానం చెప్పటం లేదని.. గట్టిగా మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారని భయం వారి నోటి నుంచి మాట రాకుండా చేస్తుందని చెబుతున్నారు. సారథులకేమో ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతుంటే.. మరోవైపు.. సాంస్కృతిక సారథుల నిర్వాహకుల వ్యవహారం మాత్రం బ్రహ్మండంగా ఉందంటున్నారు.
ఓ పక్క సారథులు జీతాల్లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు నిర్వాహకులు మాత్రం భారీగా ఆధాయాన్ని ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కరోజు ఖాళీగా ఉండకుండా.. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రచారం చేస్తూ బండి లాగిస్తున్నట్లు చెబుతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు.. హరితహారం.. మిషన్ కాకతీయ.. గోదావరి పుష్కరాలు ఇలా పలు కార్యక్రమాల మీద ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయిలు తీసుకుంటున్నా.. సారథులకు మాత్రం జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు సారథే కానీ.. ఆర్థికంగా మాత్రం సొమ్మసిల్లిన పరిస్థితని వాపోతున్నారు. మరి.. దీనిపై తెలంగాణ సర్కారు ఏం చెబుతుందో..?