Begin typing your search above and press return to search.
టీ’’లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేరితే!
By: Tupaki Desk | 30 July 2015 3:56 AM GMTరాష్ట్ర విభజన అంశం మరో కష్టాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థి.. కారణాలు ఏవైనా.. ఇంటర్ సెకండ్ ఇయర్ ను తెలంగాణ రాష్ట్రంలోని చేరితే.. అతగాడు మొదటి.. రెండో సంవత్సరం ఫీజులతో పాటు.. పరీక్షల్ని కూడా రాయాల్సి ఉంటుంది.
తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లోనూ.. తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీలో చదివిన ఇంటర్ మొదటి సంవత్సరం తెలంగాణలో ఎందుకు పనికి రాకుండా పోతుందన్న మాట. వాస్తవానికి నెల కిందట ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థుల్ని సెకండ్ ఇయర్ లో ఆడ్మిషన్లు ఇవ్వొద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
తాజాగా.. మేసేజ్ ల రూపంలో కొత్త విధానాన్ని పంపటం గమనార్హం. తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి.. సెకండ్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో చేరాలంటే.. రెండేళ్ల ఫీజులు చెల్లించటంతో పాటు.. రెండేళ్లకు సంబంధించిన ప్రాక్టికల్.. థియరీ పరీక్షల్ని రాయాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని జీవో ద్వారా కాకుండా.. ఫోన్లో ఎస్ఎంఎస్ ల రూపంలో ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. తాజా నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారుతుందన్న వాదన వ్యక్తమవుతోంది.