Begin typing your search above and press return to search.
తెలంగాణ అప్పు అక్షరాలా లక్ష కోట్లకు..!
By: Tupaki Desk | 13 April 2015 5:49 AM GMTరాష్ట్ర విభజనతో వాటాగా వచ్చిన అప్పు 61 వేల కోట్ల రూపాయలు.. ఆడిటింగ్‌లూ గట్రా జరిగితే ఇది 71 వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుతుంది. రాష్ట్రం ఏర్పడ్డాకా చేసిన అప్పు దాదాపు 8,500 కోట్ల రూపాయలు. వచ్చే ఏడాదిలో వివిధ కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేయదలిచిన అప్పు 18 వేల కోట్ల రూపాయలు... ఈ మొత్తాలన్నీకలిపితే అక్షరాల లక్ష కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరువయ్యే అవకాశం ఉంది. దాదాపు ఏడాది గడిచేలోగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో అప్పు ఆ స్థాయికి చేరనుంది!
దీనికి వడ్డీలకు గానూ గత ఏడాది బడ్జెట్‌లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే ఏడాదికి వడ్డీల రూపంలోనే దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయలను చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది!
మరి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తలలపై లక్ష కోట్ల అప్పు అంటే.. ఇది చాలా పెద్దమొత్తమే! ఒకవైపు లక్ష కోట్ల బడ్జెట్ అంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకొంటుంటే.. జనాలు మురిసిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు కూడా లక్ష కోట్ల రూపాయలున్న విషయం మరుగునపడుతోంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ విషయంలో లోటులో కాదు.. లాభాల స్థాయిలో ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ధ్రువీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ పద్దులో అప్పు పెరిగిపోతుండటం విశేషం.
మరి ఒకవైపు అభివృద్ధి అంటున్నారు.. సంక్షేమం అంటున్నారు.. బంగారు తెలంగాణ అంటున్నారు. సాగర్ చుట్టూ ఆకాశమంతటి భవనాలు అంటున్నారు.. ఊహలు అలా ఉండగా.. వాస్తవంలో వడ్డీలకే వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది!