Begin typing your search above and press return to search.
బాబు చేయలేనిది కేసీఆర్ చేసేశారు
By: Tupaki Desk | 25 Dec 2016 7:34 AM GMTఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేయలేని పనిని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్ల విధానంపై కొనసాగుతున్న ఆందోళనలకు కేసీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టగా... ఏపీలో ఇంకా ఆందోళనల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వారి నెలసరి వేతనాలను రూ.9వేలు పెంచారు. దీంతో ఇప్పటివరకు నెలకు రూ.18వేల వేతనం అందుకుంటున్నవారికి ఇకపై రూ.27వేలు లభించనున్నాయి. పెరిగిన జీతాలు ఈ నెల (డిసెంబర్) నుంచి వర్తిస్తాయి. పెరిగిన జీతాల వల్ల రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రయోజనం కలుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ లెక్చరర్ల పోస్టులను క్రమబద్ధీకరించేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో టైంస్కేల్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా సర్కారు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పోస్టులను రెగ్యులర్ చేయడానికి ఇప్పటికే న్యాయశాఖ సలహాలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో రోడ్డెక్కిన లెక్చరర్ల వివిధ రూపాల్లో తమ నిరసనలు సర్కార్ కు తెలియజేస్తున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షలు ఏకంగా 24వ రోజుకి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాల్సిందిగా కాంట్రాక్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టిన నిరసన దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అయినా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ వీటిపట్ల స్పందించకపోవడాన్ని ఆందోళనకారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీ నేతలు మాత్రం వీటికి సంఘీభావం ప్రకటించాయి. ఒక్క విశాఖ జిల్లాలోనే 360 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నారు. మొదట్లో వీరికి రూ.8,500 వేతనం లభించగా, తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ వేనతం రూ.18 వేలకు చేరింది. పదో పీఆర్ సీ కింద వీరికి నెలకు రూ.34 వేలకు వంతున వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ఇదే డిమాండ్ ను కేసీఆర్ పరిష్కరించగా..బాబు ఇంకా నాన్చుతుండటం ఇటు విద్యావ్యవస్థపై ప్రభావం పడటమే కాకుండా అటు లెక్చరర్లలోనూ అసహనం పెరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/