Begin typing your search above and press return to search.

దీపావ‌ళి సెల‌వును మార్చేసిన కేసీఆర్ స‌ర్కార్‌

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:59 AM GMT
దీపావ‌ళి సెల‌వును మార్చేసిన కేసీఆర్ స‌ర్కార్‌
X
పండుగ‌ల సెల‌వుల‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ గంద‌ర‌గోళం.. అయోమ‌యం వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. ప్ర‌జ‌లు చేసుకునే పండుగ తేదీకి.. ప్ర‌భుత్వం ఇచ్చే సెలవ‌కు పొంత‌న క‌నిపించ‌ని ప‌రిస్థితి. తాజాగా ఇలాంటి ప‌రిస్థితే తెలంగాణ రాష్ట్రంలో నెల‌కొంది.

దీపావ‌ళి సంద‌ర్భంగా సెల‌వును అక్టోబ‌రు 18గా డిసైడ్ చేశారు. తిధుల ప్ర‌కారం పండుగ అక్టోబ‌రు 19. దీంతో.. ప్ర‌భుత్వ సెల‌వుకు.. అస‌లు పండ‌క్కి సంబంధం లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో.. నెల‌కొన్న గంద‌ర‌గోళానికి చెక్ చెప్పేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగించింది.

పండితుల సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే ఉన్న సెల‌వును స‌వ‌రిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ను తీసుకుంది. మొద‌ట ఇచ్చిన సెల‌వును మార్చేసింది. దీంతో.. న‌ర‌క చ‌తుర్ద‌శికి గ‌తంలో ఉన్న అక్టోబ‌రు 17 న ఇచ్చిన సెలువ‌ను 18కి మార్చారు. అదే స‌మ‌యంలో దీపావ‌ళిని అక్టోబ‌రు 19కి మారుస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అక్టోబ‌రు 18న ఐచ్ఛిక సెలువు కాగా.. 19న దీపావ‌ళి సెలవుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది.