Begin typing your search above and press return to search.

టి - ప్ర‌భుత్వం డబ్బులు తీయట్లేదా?

By:  Tupaki Desk   |   6 Aug 2015 2:33 PM GMT
టి - ప్ర‌భుత్వం డబ్బులు తీయట్లేదా?
X
ఎవ‌రైనా సొమ్ములు ఉంటే ఏం చేస్తారు? వెంట వెంట‌నే ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు. సొమ్ముల‌కు త‌గ్గ‌ట్లు అవ‌స‌రాలు ఉంటే ప్ర‌ణాళిక‌లు కూడా అలాగే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తీరు అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ప్ర‌ణాళికతో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టినా...వివిధ వ‌ర్గాలు అందుకు త‌గ్గ‌ట్లు డిమాండ్లు వినిపిస్తున్నా నిధులు ఖర్చులో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ అందుకోవడం లేదు.

తెలంగాణ ప్ర‌భుత్వం బడ్జెట్ పెట్టి మూడు నెలలు గడిచినా...పెట్టిన ఖర్చు మాత్రం నామమాత్రంగానే ఉంది. మొదటి త్రైమాాసికం లెక్కలు ఈ విష‌యాన్ని దృవీకరిస్తున్నాయి. మార్చి నెల‌లో రూ. 1,15,689 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది సర్కార్. జూన్ తో మొదటి త్రైమాసికం ముగిసింది. ఈ మూడు నెలల కాలంలో అంటే ఎప్రిల్ నుండి జూన్ నెలఖారులో కనీసం 25 శాతం బడ్జెల్ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల 15 శాతం బడ్జెట్ ను కూడా ఖర్చు చేయలేకపోయింది తెలంగాణ‌ సర్కార్.

జూన్ ముగిసే నాటికి కనీసం 25 శాతం అంటే...సుమారు 29 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 20 వేల కోట్ల లోపునే ఖర్చు చేయగలిగింది. అంటే టార్గెట్ కన్నా10 శాతం తక్కువ ఖర్చు చేసిందన్నమాట. అయితే మొదటి త్రైమాసికం లో 25 శాతం ఖర్చు చేయడం సాధ్యపడదు. పథకాల ప్లానింగ్, పనులు అంచనాలు, రాబోయో పథకాల రుపకల్పన తదితర అంశాలకే మొదటి త్రైమాసికం పడుతుంది. అందుకే ఏ ప్రభుత్వం కూడ 25 శాతం నిధులను ఖర్చు చేయలేదని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ప్రతిమూడు నెలలకు గాను ఈ ఖర్చు ఓ మోస్తురు గానే ఉండేది. కనీసం 20 శాతం బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి. అయితే మిగులు తెలంగాణ రాష్ట్రం అని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు 15 శాతమే బడ్జెట్ నిధులను ఖర్చు చేసిందనేది చర్చనీయాంశం అవుతోంది.