Begin typing your search above and press return to search.

బ‌తుక‌మ్మ స్పెష‌ల్‌: మ‌రో సెల‌వు ఇచ్చిన టీ స‌ర్కార్‌

By:  Tupaki Desk   |   19 Oct 2015 11:45 AM GMT
బ‌తుక‌మ్మ స్పెష‌ల్‌: మ‌రో సెల‌వు ఇచ్చిన టీ స‌ర్కార్‌
X
వ‌రాలు ఇవ్వ‌టంలో ఎంత ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తారో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సెల‌వులు ప్ర‌క‌టించ‌టంలోనూ అంతే ఉదార‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. పండ‌గ‌ల‌కు.. ప‌ర్వ‌దినాల‌కు.. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా ఎవ‌రూ పెద్ద‌గా అడ‌గ‌కుండానే సెల‌వులు ఇచ్చేసి స‌ర్ ప్రైజ్ చేస్తుంటారు.

మొన్న‌టికి మొన్న బ‌తుక‌మ్మ ప‌ర్వ‌దినం షురూ సంద‌ర్భంగా సెల‌వును ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. తాజాగా బ‌తుక‌మ్మ ఖాతాలో మ‌రో సెల‌వును ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం తెలంగాణ వ్యాప్తంగా సుద్దుల బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు భారీగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఉద్యోగులు.. వ్యాపారుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు వీలుగా తెలంగాణ స‌ర్కారు సెల‌వును ప్ర‌క‌టించింది.

మంగ‌ళ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఎల్బీ స్టేడియం వ‌ద్ద బ‌తుక‌మ్మ‌ల‌తో ట్యాంక్ బండ్ వ‌ర‌కు ర్యాలీ నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ప‌టాసులు పేల్చ‌టం ఆన‌వాయితీ. ఈ కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హించ‌టానికి వీలుగా తెలంగాణ స‌ర్కారు సెల‌వును ప్ర‌క‌టించింది.