Begin typing your search above and press return to search.
‘లెక్క’ కరుకు కేసీఆర్ దగ్గర నేర్చుకో బాబు
By: Tupaki Desk | 27 Feb 2016 5:10 AM GMTఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్న చందంగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి. తెలంగాణ ప్రయోజనాల తర్వాత మరేమైనా అన్నట్లుగా వ్యవహరించే ఆయన వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. విషయం ఏదైనా కానీ తమ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందంటే.. అవతల వాళ్లు ఎవరైనా.. వాళ్లు ఏమనుకున్నా తాను మాత్రం మొండితనంతో పోరాడుతూనే ఉంటారు.
ఏపీ నుంచి వచ్చే చిల్లర మొత్తం కోసం పంతం పట్టి మరీ దాదాపు ఏడాదికి పై నుంచి పర్యాటకుల్ని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారు తాజాగా ఓకే చెప్పేసింది. కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో ఉండే అక్కమహాదేవి గుహలకు వెళుతుంటారు. దీని కోసం పడవ ప్రయాణం చేస్తారు. అయితే.. గుహలు ఉన్న ప్రాంతం తెలంగాణకు చెందింది కావటంతో.. పడవలు నడిపే వారిని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు.
పర్యాటకుల నుంచి వసూలు చేసే పడవ ఛార్జీలో తమ వాటా లెక్క తేల్చాలంటూ ఏడాది నుంచి పర్యాటకుల్ని నిలిపివేశారు. ఈ విషయంపై ఏపీ అధికారులు చేసిన సూచనల్ని తెలంగాణ అధికారులు పట్టించుకోలేదని చెబుతారు. చివరకు.. తాము కోరినట్లుగా టిక్కెట్టు ఆదాయంలో భాగం ఇచ్చేందుకు ఏపీ అధికారులు ఓకే చెప్పటంతో అక్కమహాదేవి గుహలకు శ్రీశైలం నుంచి ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేసింది.
ఇక్కడ బాబు నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే.. తన రాష్ట్రానికి కలిగే కించిత్ ప్రయోజనాన్ని కూడా వదులుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ మాత్రం సిద్దంగా లేరన్న విషయంతో పాటు.. తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చే వరకు పట్టిన పట్టును అదే తీరులో కొనసాగించటం. ఇదే రీతిలో ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు అంతే కరుకుగా వ్యవహరించాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ ఏపీకి వెళ్లిన గ్రామాల్లో కొన్నింటిని బాబు తెలంగాణకు ఇచ్చేస్తామని చెప్పినట్లు ప్రకటించారు. చిల్లర మొత్తం విషయంలోనే కేసీఆర్ సర్కారు ఇంత పక్కాగా ఉంటే.. గ్రామాలకు గ్రామాల్ని తెలంగాణకు ఏపీ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న ఎదురవుతుంది. అందుకే.. భరోసా బాబు ఏపీ ప్రయోజనాల విషయం మరింత జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు పలువురు చేస్తున్నారు.