Begin typing your search above and press return to search.

స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పిన తెలంగాణ గవర్నర్ .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   1 Sept 2021 1:03 PM IST
స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పిన తెలంగాణ గవర్నర్ .. ఎందుకంటే ?
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి పాఠశాలలు తెరుచుకున్నాయి. మొదటి నుంచి సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష తరగతులు మాత్రమే కొనసాగుతాయని చెబుతూ వచ్చిన ప్రభుత్వం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. పిల్లలకి పాఠాలు ఆన్‌ లైన్‌ లో బోధించాలా, లేక ఆఫ్‌ లైన్‌ లోనా అనేది పాఠశాల యాజమాన్యాల ఇష్టమేనని స్పష్టంచేసింది. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను మాత్రం ఇప్పట్లో తెరవడానికి వీల్లేదని ఆదేశించింది. అలాగే పిల్లలని స్కూల్స్ కి పంపడం ఇష్టం లేని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టవద్దు అని , వారికి ఆన్లైన్ లో పాఠాలు చెప్పాలని కోర్టు తెలిపింది. పిల్లలు కరోనా బారినపడితే విద్యాసంస్థల యాజమాన్యాలదే బాధ్యత.ప్రత్యక్ష తరగతులు నిర్వహించే పాఠశాలలు తగిన కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించేలా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌ వోపీ)ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వారంలోపు జారీ చేస్తారు.

ఇదిలా ఉంటే .. చాలా రోజుల పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లలందరూ చాలా ఉత్సహంగా స్కూల్స్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై కొద్దిసేపు టీచర్ గా మారిపోయారు. రాజ్ భవన్ స్కూల్ లో ఏర్పాట్లను పరిశీలించిన తమిళి సై, పిల్లలకు, సిబ్బందికి కరోనా వైరస్ పాఠాలు చెప్పారు. ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ పిల్లలకు అవేర్ నెస్ కల్పించారు. ఏవిధంగా మాస్క్ ధరించాలి, అలాగే కరోనా సోకకుండా ఎలా శానిటైజ్ చేసుకోవాలి, అలాగే మరో ముఖ్యమైన నియమం భౌతిక దూరం ఎలా పాటించాలి అనే విషయాన్నీ పిల్లలకు వివరించారు.

పాఠశాల స్టూడెంట్స్ కు మాస్కులు అందజేసి, జాగ్రత్తలు చెప్పారు. క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్, వాష్ రూమ్, ఎక్కడైనా సరే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు. టీచర్లు, స్కూల్ సిబ్బందికి కూడా కరోనా జాగ్రత్తలు చెప్పారు. స్కూల్స్ రీఓపెన్ తో పిల్లల్లో సంతోషం కనిపిస్తోందన్నారు గవర్నర్ తమిళిసై. పిల్లలు తమ ఆనందాన్ని లౌడ్ వాయిస్ తో తెలియజేశారని తెలిపారు. రాజ్ భవన్ స్కూల్ లో ప్రతి క్లాస్ రూమ్ తిరిగారు, ఏర్పాట్లు బాగున్నాయ్ అంటూ సిబ్బందిని గవర్నర్ అభినందించారు. పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు తెలిపిన గవర్నర్ తమిళిసై, ఇక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు.

నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమవుతుండడంతో రాష్ట్ర గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు గవర్నర్ స్వయంగా మాస్కులు అందజేసి పలు జాగ్రత్తలు సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇన్నాళ్లు పిల్లల్ని కాపాడిన తల్లిదండ్రులను అభినందించారు. ఇవే జాగ్రత్తలు భవిష్యత్తులో నూ తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారని ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే పిల్లలను స్కూళ్లకు పంపాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురకూడని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ప్రత్యక్ష బోధనపై విద్యార్ధులను బలవంతం చేయొద్దని పేర్కొంది. పాఠశాలలో ఉన్నప్పుడు ఏ విద్యార్ధి అయినా వైరస్ బారినపడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఒకవేళ అలా చేస్తే స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలు మాస్కులు ధరించేలా, శానిటైజర్ వాడేలా చూసుకోవాలి. వీలైనంత వరకు పిల్లల్ని పేరెంట్స్ బడి దగ్గర దింపాలి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు స్నానం చేయించాలని అంటున్నారు.