Begin typing your search above and press return to search.
రాజ్ భవన్ లో పేదలకు భోజనం.. గవర్నర్ తమిళసై వినూత్న కార్యక్రమం
By: Tupaki Desk | 9 Feb 2021 4:40 AM GMTతెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి తమిళ సై సౌందర్‌రాజన్ తన మార్కును చూపిస్తున్నారు. కరోనా టైంలో ఏకంగా ఆమె ఉన్నతాధికారులతో సమావేశమై సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. అయితే తమిళ సై గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘రాజ్‌భవన్ అన్నం’ పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాజ్‌భవన్‌లో పనిచేసే కార్మికులు, తోటపనివాళ్లు, అలాగే రాజ్‌భవన్ స్కూల్లో చదివే పేద ప్రజల కోసం ఆమె ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.
‘రాజ్‌భవన్ అన్నం’ పేరిట వాళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకాన్ని సోమవారం గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రారంభించారు. ప్రతిరోజు పేదలకు రెండు పూటలా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి. సోమాజిగూడలో రాజ్‌భవన్ ఉన్న విషయం తెలిసిందే.
ప్రతిరోజు దాదాపు 500 మందికి ఇక్కడ భోజనం పెట్టబోతున్నారు. ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఈ కార్యక్రమం పేదలకు మేలు చేకూరుస్తుందని రాజ్‌భవన్ అధికారులు అంటున్నారు.రాజ్‌భవన్‌లోని వంటలు చేస్తారు కాబట్టి.. భోజనం, కూరల విషయంలో కచ్చితంగా నాణ్యత ఉంటుందని వాళ్లు అంటున్నారు.