Begin typing your search above and press return to search.

మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లకు పునరావాసంగా తెలంగాణ సర్కార్

By:  Tupaki Desk   |   17 Feb 2023 1:00 PM GMT
మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లకు పునరావాసంగా తెలంగాణ సర్కార్
X
ప్రభుత్వంలో ఏ స్థాయి ఉద్యోగం చేస్తున్నా.. ఉన్నంతకాలం ప్రతి ఒక్కరిలో ఏదో ఫీలింగ్ ఉంటుంది. రిటైర్డ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇక తమ జీవితం ముగిసినట్లేనని భావిస్తుంటారు. కానీ తెలంగాణలో రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగుల్లో ఇప్పుడు బెంగ అక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఉన్నతస్థాయి అధికారులు తాము రిటైర్డ్ అయ్యాక ఏం చేయాలా? అని చింతించనక్కర్లేదు. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావసంగా మారింది. వారికి ఉద్యోగం పోయినా ప్రభుత్వం ఏదో ఒక పదవి ఇచ్చి వారిని తిరిగి నియమించుకుంటోంది. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయని చెబుతోంది. ఆ షరతులేంటో ఒకసారి చూద్దాం.

తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది రిటైర్డ్ అయిన ఉన్నతోద్యోగులు మళ్లీ కార్యాలయాల్లోనే దర్శనమిస్తున్నారు. పదవీ విరమణ వయసు పూర్తయినా తిరిగి వారు ఉద్యోగంలో చేరారన్నమాట. వీరిలో ముఖ్యంగా నర్సింగరావు, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. గతంలో కోల్ ఇండియా సీఎండీగా పనిచేసిన నర్సింగారావు 2018లో రిటైర్డ్ వయసు పూర్తయింది.

కానీ కేసీఆర్ ఆయనకు సీఎంలో సెక్రటరీగా అవకాశం కల్పించారు. భూపాల్ రెడ్డి 2012లోనే పదవి విరమణ పొందారు. కానీ ఆయనకూ సీఎంలోనే ఛాన్స్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి అనే మరో ఉన్నతోద్యోగికి ఇందులోనే నియమించారు.

రిటైర్డ్ అయిన ఆఫీసర్లను ఇలా సీఎంలోనే కాకుండా సలహాదారులుగా కూడా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మ, ఐఏఎస్ అధికారులు అనురాశ్ శర్మ, ఏకే ఖాన్, రమణాచారి లాంటి వారికి సలహాదారులుగా నియమించారు. అంటే వీరు వయసు అయిపోయినా ప్రభుత్వంలో కొనసాగుతున్నారన్నమాట. ప్రభుత్వంలో ఈ పదవికి అర్హలు చాలా మంది ఉన్నారు. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ రిటైర్డ్ అయిన వారిని మాత్రమే నియమించుకోవడం ఆసక్తిగా మారింది.

ఇందులోనూ తనకు నచ్చిన వారినే నియమిస్తారన్న చర్చ సాగుతోంది. ఉదాహరణకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి తనకూ ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. కానీ అయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.

దీంతో కేసీఆర్ కు నచ్చిన వారిని మాత్రమే నియమించుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు రిటైర్డ్ ఆఫీసర్లను నియమించుకోవడం ద్వారా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోలేరని, ఇతర అధికారులైతే భయంతో పనిచేస్తారని అంటున్నారు. కానీ కేసీఆర్ వీరిని మాత్రమే నియమించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.