Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీయుల మ‌న‌సుల్ని దోచుకునే నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   11 Oct 2017 7:07 AM GMT
హైద‌రాబాదీయుల మ‌న‌సుల్ని దోచుకునే నిర్ణ‌యం
X
కోటి మందికి పైనే ఉన్న హైద‌రాబాదీయులు నిత్యం ఎదుర్కొనే స‌మ‌స్య పార్కింగ్‌. మాల్ మొద‌లు చిన్న కాంప్లెక్స్ వ‌రకూ పార్కింగ్ పేరుతో బాదే బాదుడు అంతా ఇంతా కాదు. సినిమాకు వెళ్లినా.. షాపింగ్ వెళ్లినా.. చివ‌ర‌కు ఆసుప‌త్రికి వెళ్లినా పార్కింగ్ పేరుతో నిత్యం బాదేస్తుంటారు.

అన్నింటికి మించి మాల్స్ కు వెళితే.. ముక్కుపిండి వ‌సూలు చేసే మొత్తం చూసిన ప్ర‌తిసారీ ఒళ్లు మండిపోతుంటుంది. ఇటీవ‌ల మాల్ యాజ‌మాన్యాలు పార్కింగ్ ఫీజు పేరుతో భారీ దందాకు తెర తీసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొన్ని ప్ర‌ముఖ మాల్స్ మీద పోలీస్ కంప్టైంట్ ఇవ్వ‌ట‌మే కాదు.. కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండ‌గా.. పార్కింగ్ ఫీజుల‌పై సామాన్యుల్లో మండుతున్న మంట‌ను చ‌ల్లార్చేందుకు.. పార్కింగ్ పీజు దందాను త‌గ్గించేందుకు వీలుగా తెలంగాణ‌రాష్ట్ర స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ చ‌ట్టం 1955, భ‌వ‌న నిర్మాణ నిబంధ‌న‌లు 2012 ప్ర‌కారం ఏ భ‌వ‌నానికైనా నిర్ణీత పార్కింగ్ ఉండాల‌ని.. నివాస భ‌వ‌న‌మైతే 33 శాతం వాణిజ్య నిర్మాణ‌మైతే 43 శాతం పార్కింగ్ కోసం వ‌ద‌లాది. భ‌వ‌నంలోకి వ‌చ్చే వాహ‌నాలు అన్నింటికి ఉచిత పార్కింగ్ వ‌స‌తి క‌ల్పించాలి. అయితే.. ఈ నిబంధ‌న ఎక్క‌డా అమ‌లు కావ‌టం లేదు. దీంతో.. దీనిపై ప‌లువురు త‌ప్పు ప‌డుతూ.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జ‌రిగిన అధికారుల స‌మావేశంలో.. పార్కింగ్ పీజుల దందా నుంచి సామాన్యుల్ని మిన‌హాయించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న‌ది ఒక‌టైతే.. ఇందుకు సంబంధించిన విధి విధానాల్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలంటూ మంత్రి కేటీఆర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. మాల్స్ మొద‌లుకొని వాణిజ్య స‌ముదాయాల వ‌ర‌కూ సినిమా చూసినా.. ఇత‌ర కొనుగోళ్లు చేసినా పార్కింగ్ బాదుడు ఉండ‌ద‌ని తేల్చేశారు. ఏమీ కొన‌కుండా ఊరికే తిరుగుతూ ఉండే వారు తీసుకొచ్చే వాహ‌నాల మీద‌నే పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా చ‌ట్టాన్ని మార్చాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్పుడు అమ‌ల‌వుతున్న త‌ర‌హాకు చెక్ చెప్పి.. సినిమా చూసి వ‌చ్చిన వారి టికెట్ చూపిస్తే.. పార్కింగ్ ఫీజు ను మిన‌హాయింపు ఇచ్చేలా తాజా నిర్ణ‌యం ఉండ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ‌.. ఇదే రీతిలో కానీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంటే హైద‌రాబాదీయులంతా హ్యాపీగా ఫీల్ కావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.