Begin typing your search above and press return to search.

అవాక్కయ్యే మాట చెప్పిన కేసీఆర్ సర్కార్

By:  Tupaki Desk   |   29 Dec 2016 11:33 PM IST
అవాక్కయ్యే మాట చెప్పిన కేసీఆర్ సర్కార్
X
మానవత్వం అన్నది ఒంట్లో ఏ కోశాన లేని మానవ మృగం లాంటి నయింకు సంబంధించిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నరరూప రాక్షసుడి వెనుక భారీ ఎత్తున రాజకీయ నేతలు.. పెద్ద ఎత్తున పోలీసులు.. ఇతర ప్రముఖులు ఉన్నట్లుగా చెబుతున్న వేళ.. తెలంగాణ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించటం గమనార్హం.

నయిం లాంటి రాక్షసుడు ఎన్ కౌంటర్ అయినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని.. తాను నల్గొండకు వెళితే.. పాపాత్ముడి పీడ వదిలించారంటూ అక్కడి ప్రజలు జయజయద్వానాలు చేస్తున్నారని.. తమ సర్కారు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గదని ముఖ్యమంత్రి కేసీఆర్ వీరావేశంతో అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఆయన మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్న వేళ.. ఆయన సర్కారు జనాలకు షాకిచ్చేలా వ్యవహరించింది.

నయింతోరాజకీయ నేతలు.. అధికారులు ఎవరితోనూ సంబంధాలు లేవని తెలంగాణ సర్కారు తాజాగా తేల్చి చెప్పింది. నయిం ఎన్ కౌంటర్ ఇష్యూలో తెలంగాణ హోం శాఖ దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్లో సంచలన విషయాలు ఉన్నాయి. నయింకూ రాజకీయ నేతలతో.. పోలీసు అధికారులతో ఎలాంటి సంబంధాలు లేవు. ఒక మాజీ డీజీపీ నయింకు సహకరించారన్న ఆరోపణలుకూడా అవాస్తవం. ఉగ్రవాది.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పటానికి లాంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొంది. ఇంకా నయం.. నయిం లాంటోడు ఈ భూ ప్రపంచం మీద జీవించలేదు. అసలు పుట్టనేలేదు.. ఇదంతా జనాల భ్రమ అని చెప్పనందుకు సంతోషించాలేమో..?