Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాడట.. మోడీజీ ఖాతాలో ఇది 9వ రాష్ట్రమన్నట్టు?

By:  Tupaki Desk   |   12 Nov 2022 10:32 AM GMT
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాడట.. మోడీజీ ఖాతాలో ఇది 9వ రాష్ట్రమన్నట్టు?
X
దేశ రాజకీయాల్లో ఇతర ప్రభుత్వాలను కూల్చడం.. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం.. ఇది తప్ప కేంద్రంలోని మోడీ సర్కార్ ఏం చేసిందన్నప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే తమను కాదని.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు బోటాబోటా మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అందులోని అసంతృప్తులైన ఏకనాథ్ షిండేలను 'స్వామీజీ'లను రంగంలోకి దింపి లాగడం.. కోట్లు ఎర వేయడం..రిసార్ట్ రాజకీయాలతో ప్రభుత్వాలను కూల్చడం.. ఇదే జరుగుతోంది దేశంలో.. తెలంగాణలోనూ అదే పనిచేసి వీడియోలను అడ్డంగా దొరకడంతో ఈ బీజేపీ 'ప్రభుత్వాల' హైజాక్ కథ బయటకు వచ్చింది.

తెలంగాణకంటే ముందు మహారాష్ట్రలోనూ శివసేన సర్కార్ ను కూల్చేసి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేనలోని అసంతృప్త 'ఏక్ నాథ్ షిండే'ను వాడుకొని ఆయన్నే సీఎంను చేసి మహారాష్ట్రను ఆక్రమించేశారు. ఇలా ఇప్పుడే కాదు.. గతంలోనూ ఎన్నో సార్లు చేశారు. మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక , అసోం సహా ఎన్నో రాష్ట్రాలను బీజేపీ ఇలానే హస్తగతం చేసుకుంది.

నిజానికి కేసీఆర్ సర్కార్ దొరకబట్టే వరకూ కూడా అసలు బీజేపీ ఆపరేషన్లు ఎలా చేస్తుందన్న విషయం బయటకు తెలియలేదు. కానీ స్వామీజీలతో కోట్లు కురిపించి చేస్తారన్న విషయం తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లతో బయటపడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 కోట్లకు అమ్ముడుపోకపోవడంతోనే వెలుగుచూసింది. లేకుంటే తెలంగాణ కూడా మరో మహారాష్ట్ర అయ్యిండేది.

తాజాగా ఏపీ పర్యటన ముగించుకొని వచ్చిన మోడీజీ కూడా డైరెక్టుగా అదే మాట అనడం సంచలనమైంది. 'ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో 4 దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటుందో అలాంటి సమయంలోనే కమలం వికసిస్తుంది. కష్టకాలంలో మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు.

మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరికి సీటు ఇవ్వాలన్నా.. తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాలనే ఆశ్రయిస్తోంది' అని మోడీ ఫైర్ అయ్యారు.

'తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలదోస్తాం' అంటూ మోడీ ప్రకటించడం చూసి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్న మొయినాబాద్ ఫాంహౌస్ లో చేసిన పని అదే కదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా చేసిందే తెలంగాణలో చేస్తామని మోడీ ఎంత ధైర్యంగా చెబుతున్నాడో చూడండి అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. స్వామీజీలతో రాష్ట్రాలను కూలుస్తున్న తీరు చూశాకైనా మోడీలో పశ్చాత్తాపం కనిపించకపోవడమే ఇక్కడ విడ్డూరం మరీ..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.