Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రభుత్వం దాచిపెడుతోందా?
By: Tupaki Desk | 11 May 2020 9:50 AM GMTఓవైపు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా లక్షా 30 వేల దాకా కరోనా వైరస్ పరీక్షలు చేశారు. కానీ తెలంగాణలో చూస్తే పరీక్షల సంఖ్య 20 వేలు దాటలేదు. నెల రోజులుగా ఏపీలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేసులు బయట పడుతుంటే.. తెలంగాణ లో మాత్రం చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్లే ఏపీలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని.. తక్కువ కేసులతో సరిపెడుతుండటం వల్లే తెలంగాణలో కేసులు వెలుగులోకి రావడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఐతే ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ సర్కారు మాత్రం పరీక్షలు పెంచే ప్రయత్నమే చేయట్లేదు. వైరస్ లక్షణాలున్నట్లు భావించిన బాధితులు తమ వద్దకు వస్తే తప్ప పరీక్షలు చేయమని.. రాండమ్ టెస్టులకు అవకాశమే లేదని తెలంగాణ మంత్రులు తేల్చి చెబుతున్నారు.
ఐతే టెస్టులు తక్కువ సంఖ్యలో చేయడం ద్వారా రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా కేసుల్ని రిపోర్ట్ చేసే విషయంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని.. మరణాల్ని సైతం మరుగున పరుస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్లో ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే తెలంగాణ ప్రభుత్వం దాపరికం బయట పడిపోతోంది. ఆదిత్య బెల్దె అనే వ్యక్తి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ వేశాడు. తన బాబాయి శ్రీనివాస్‌కు కరోనా ఉన్నట్లు శనివారం (మే 9)న తేలిందని.. ఆయన ఆదివారం మరణించారని.. కానీ ప్రభుత్వ హెల్త్ బులిటెన్ లో, మీడియాలో మాత్రం ఆదివారం కరోనా వల్ల మరణాలే లేవని రిపోర్ట్ చేశారని.. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరాడు. దీన్ని బట్టి చూస్తే కరోనా కేసులు, మరణాల రిపోర్టింగ్ తెలంగాణలో సరిగా లేదని.. ప్రభుత్వం దాపరికం పాటిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.