Begin typing your search above and press return to search.

గవర్నర్ పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్లాన్

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:44 AM GMT
గవర్నర్ పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్లాన్
X
కంటపడితే కనికరిస్తాడామే కానీ వెంటపడితే మాత్రం కేసీఆర్ అంత ఈజీగా వదలడని బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ మాట ఉంది. ఇటీవల ఈటల రాజేందర్ ఉదంతమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు కేసీఆర్ తో సై అంటే సై అంటున్న గవర్నర్ తమిళిసైతోనూ తేల్చుకునేందుకే కేసీఆర్ రెడీ అవుతున్నారు. గవర్నర్ తో పెరుగుతున్న దూరం ఇప్పుడు న్యాయస్థానానికి చేరుతుంది. ఈసారి గవర్నర్ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం.

తెలంగాణలో బడ్జెట్ సమావేశలకు వేలైంది. ఫిబ్రవరి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకూ అనుమతి రాలేదు. ఇదే సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో ప్రభుత్వం గవర్నర్ ను బడ్జెట్ కు అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది. దీంతో ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారనుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఈసారి మరో నాలుగు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలున్నాయి. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం ఈనెల 21న గవర్నర్ కు లేఖ రాసింది.దీనిపై గవర్నర్ ఆమోదించలేదు. సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కాపీ పంపాలంటూ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ పంపింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదంపైనే హైకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

గవర్నర్ ఆమోదం తర్వాత కేబినెట్ ఆమోదించి బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించనుంది. తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సమయం సమీపిస్తుండడంతో హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దుష్యంత్ దవేను రంగంలోకి దించింది.

లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించనున్నారు. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీంతో గవర్నర్ తో కేసీఆర్ ఫైట్ దేవవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.