Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పై తెలంగాణ సర్కార్ క్లారిటీ

By:  Tupaki Desk   |   2 April 2021 4:45 AM GMT
లాక్ డౌన్ పై తెలంగాణ సర్కార్ క్లారిటీ
X
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నారని.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ప్రజలలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ గురించి ప్రచారమైన ఆ ఉత్తర్వులు నకిలీవి అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అనంతరం గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. "షాపులు మరియు వాణిజ్య సంస్థలను మూసివేయడానికి 2021 ఏప్రిల్ 1న జారీ చేసిన జిఒ పత్రం సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. పైన పేర్కొన్న పత్రం నకిలీ అని దీని ద్వారా స్పష్టం చేస్తున్నాం. లాక్ డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు" అని ఆయన అన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ పరిశీలనలో లేదని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

కొంతమంది దుండగులు పాక్షిక లాక్ డౌన్ గురించి నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించారని, దీనిని ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలను కోరారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. సోమేష్ కుమార్ పేరిట జారీ చేసిన నకిలీ జీవో ఇదీ. ఆయన సంతకం లేకుండా ఉంది. ప్లే జోన్లతో సహా అన్ని దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలు సాయంత్రం 6 గంటల తరువాత మూసివేస్తారని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు ఉదయం 8 నుండి తెరవాలని తెలిపారు. 'జిఓ' ప్రజల్లో గందరగోళానికి దారితీసింది. ప్రభుత్వం వెంటనే ఒక ఉత్తర్వు జారీచేసింది.

తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మార్చి 26 న అసెంబ్లీకి చెప్పారు. "గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరిపై మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని చూపిందని.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూల్చిందని.. ఆదాయం పడిపోయిందని.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే లాక్ డౌన్ పై ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబడదు" కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రజలంతా కోవిడ్ -19 భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మరియు సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కేసీఆర్ కోరారు. అయినా ఫేక్ లాక్ డౌన్ ఉత్తర్వులు వైరల్ కావడం గమనార్హం.