Begin typing your search above and press return to search.

మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి !

By:  Tupaki Desk   |   11 Feb 2021 5:56 AM GMT
మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి  !
X
తెలంగాణ యువతి మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా 'మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020' పోటీల్లో విజేతగా నిలిచింది. హర్యానా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, యూపీకి చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌ గా నిలిచారు.ఈ పోటీలు నిన్న రాత్రి ముంబయిలో జరుగగా ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా విజేతగా నిలిచిన మానసను అభినందించారు.

జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు. ఇకపోతే , సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న మానస చిన్నప్పటి నుండి మోడలింగ్ పై ఆసక్తితో ఈ వైపుకు వచ్చినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.హరియానా యువతి మానిక శికందర్‌ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 గా నిలిచింది. ఇక ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన మాన్యసింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్ గా నిలిచింది. ఈ అందాల కాంపిటీషన్ జ్యూరీ సభ్యులుగా నేహా ధుపియా, చిత్రాంగధ సింగ్‌, పులకిత్ సామ్రాట్‌ ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లు వ్యవహరించారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కలర్స్ ఛానెల్ లో ఫిబ్రవరి 28 న టెలికాస్ట్ కాబోతుంది. మిస్ ఇండియా 2020 మానస వారణాసి హైదరాబాద్ లో ఇంజనీర్ గా పనిచేస్తుంది.