Begin typing your search above and press return to search.
ధనిక రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంది సారూ? కొండలా పెండింగ్ బిల్లులు
By: Tupaki Desk | 23 April 2023 12:10 PM GMTతొమ్మిదేళ్ల క్రితం మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఒక వెలుగు వెలిగిన తెలంగాణ.. తాజాగా తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. పనులు ఏవైనా బిల్లులు మాత్రం పెండింగ్ లో ఉంటున్న వైనంపై ఇబ్బందికరంగా మారింది. పేరుకే సంపన్న రాష్ట్రం కానీ.. గల్లా పెట్టెలో డబ్బులు లేని కారణంగా చెల్లింపులు జరపలేని దుస్థితి.
పెండింగ్ లో ఉన్న బిల్లుల లెక్క తేలాలంటే దాదాపు రూ.15వేల కోట్లకు పైనే అవసరమని చెబుతున్నారు. ఈ భారీ మొత్తానికి తగ్గట్లు నిధులు లేకపోవటంతో.. ఎక్కడికక్కడ బిల్లుల్ని పెండింగ్ లో పెట్టేస్తున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లుల పంచాయితీ ఉన్నప్పటికీ.. రోజులు గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. గతంలో కోట్ల రూపాయిల బిల్లులు పెండింగ్ లో ఉంటే.. ఇప్పుడు లక్షల్లో ఉన్న బిల్లుల్ని సైతం పెండింగ్ పెట్టాల్సి వస్తోందంటున్నారు. శాఖల వారీగా చూస్తే.. ఒక్క సాగునీటి పారుదల శాఖలోనే రూ.10వేల కోట్ల వరకు పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి.
ప్రాజెక్టుల్ని పొందిన బడా సంస్థలు.. తమ పనుల్ని చిన్న సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. అయితే.. సమయానికి బిల్లులు రాకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓపక్క రాష్ట్ర ఆదాయం బాగున్నప్పుడు.. ఇంత నిధుల కొరత ఎందుకు ఎదుర్కొంటున్నట్లు? అన్నది ప్రశ్నగా మారుతోంది. నెలవారీగా రావాల్సిన ఆదాయం లెక్క పక్కాగా ఉన్నట్లే.. ఖర్చుల లెక్క కూడా అదేస్థాయిలో ఉండటమే అసలు సమస్యగా చెబుతున్నారు.
సంక్షేమ పథకాలకు చెల్లించాల్సిన మొత్తాలు.. ఉద్యోగుల వేతనాలు.. గడిచిన కొన్నేళ్లుగా తెచ్చిన అప్పులకు అసలు.. వడ్డీ మొత్తాల్ని చెల్లించాల్సి రావటం కూడా ఒక సమస్యగా మారింది. దీంతో.. ఏ నెల రాబడి.. ఆ నెల ఖర్చుకు సరిపోతుంది. దీంతో.. బిల్లుల చెల్లింపులకు డబ్బుల్లేని పరిస్థితి. ముందుకు.. వెనక్కి కదల్లేని రీతిలో మారిన ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కేసీఆర్ ఎలా బయటపడతారు? అన్నది ప్రశ్నగా మారింది.