Begin typing your search above and press return to search.
పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?
By: Tupaki Desk | 5 April 2023 3:00 PM GMTతెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తే అందరూ చెప్పే సమాధానం 'డిసెంబర్' అని.. కానీ ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్ద ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలంటే.. రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ స్కెచ్ గీసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే 2024లో మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ను జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ రాష్ట్రాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాయి. పార్లమెంట్ తోపాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతాడని.. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించవచ్చన్న ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్టు సమాచారం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే జమిలీ ఎన్నికల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాల పై కసరత్తు చేస్తున్నాయి.
బలమైన పోటీదారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా వెళితే ఎదుర్కోలేమని.. సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి అసెంబ్లీకి, పార్లమెంట్ కు ఒకటే ఓటు పడడం ఖాయమని.. ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న ఆశ బీజేపీకి ఉంది.
అందుకే ఈసారి డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికల కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక మేలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అలా అయితే కేసీఆర్ ను దెబ్బకొట్టడంతోపాటు బీజేపీకి అధికారం రాష్ట్రంలో దక్కుతుందని చూస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.