Begin typing your search above and press return to search.
దివ్యాంగుల కోసం ఈసీ చేసిన ఏర్పాట్లు ఇవే..!
By: Tupaki Desk | 5 Dec 2018 5:23 PM GMTఅందరికీ అందుబాటులో ఎన్నికలు అనే నినాదంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే విషయంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 46 వేల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 7 లక్షల 10 వేల మంది 18 ఏళ్లు నిండినవారు. అందులో 4 లక్షల 60 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటేసేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
వీల్ చైర్లలో వచ్చే దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ ర్యాంపులు సిద్ధం చేస్తున్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపి ద్వారా ఎపిక్ కార్డులు రెడీ చేశారు. దివ్యాంగులకు పోలింగ్ బూత్ల దగ్గర సలహాలు సూచనలు అందించడానికి వీలుగా ఎన్నికల సిబ్బందికి, స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. కోడ్ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడానికి అవసరమైన 15-20 సూత్రాలతో కరపత్రాలు ముద్రించి ఎన్నికల సిబ్బందికి ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా అధ్యయనం చేస్తూ, మౌలిక సదుపాయాలు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఈసీనే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ ప్రతినిధుల సహకారంతో వంద శాతం పోలింగ్ అయ్యేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతోపాటు దివ్యాంగులు పోలింగ్లో పాల్గొనేలా వాధా అనే ప్రత్యేక యాప్ ని ఈసీ రూపొందించింది. ఈ యాప్లో దివ్యాంగుల చిరునామాలు, ఇతరత్రా వివరాలు ఉంటాయి. వలంటీర్లు దివ్యాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, ఓటు వేసిన తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తారు.ఈ ఒక్క ఎన్నికల కోసం మాత్రమే కాకుండా దివ్యాంగులు అన్ని ఎన్నికల్లో ఓటు వేసే విధంగా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ.