Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాలు 30 కాదు.. ‘‘31’’
By: Tupaki Desk | 4 Oct 2016 5:07 AM GMTఊహించని పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అందరూ పండగ చేసుకునే వేళ..కొందరు మాత్రం ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి. అందరూ సంతోషంగా ఎందుకు ఉండకూడదు? అన్న కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. విపక్షాలు అవాక్కు అయ్యేలా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకాలం కొత్త జిల్లాలతో కలిపి తెలంగాణలో 27 జిల్లాలు ఉండాలన్న నిర్ణయాన్ని మారుస్తూ.. ఆదివారం మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం తెలిసిందే. దీనిపై వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాల నేపథ్యంలో.. కేసీఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకూ అనుకున్నట్లు తెలంగాణలో జిల్లాల సంఖ్యను 30 స్థానే.. ‘‘31’’ ఫైనల్ చేస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. సాధ్యాసాధ్యాల మీద కసరత్తు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విషయం ఏదైనా కడుపు నిండుగా ఉండాలన్నట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కొత్త జిల్లాలపై ఇంతకాలం సాగిన రాజకీయ దాడిని తన ఒక్క నిర్ణయంతో మొత్తంగా మార్చేశారు. ఆదివారం కొన్ని జిల్లాల టీఆర్ ఎస్ మంత్రులు.. ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. సోమవారం కరీంనగర్.. ఖమ్మం.. అదిలాబాద్.. హైదరాబాద్.. వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై వారికున్న సందేహాలు.. అభ్యంతరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. ‘‘దసరా రోజు ప్రారంభయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటుంటే.. గద్వాల.. సిరిసిల్ల.. జనగామ జిల్లాలు కాలేదని అక్కడి ప్రజలు ఎందుకు ఏడ్వాలి? ఎందుకు బాధపడాలి? మేం అడిగినా జిల్లాలు చేయలేదని పండుగ పూట అక్కడి ప్రజలు నన్నెందుకు తిట్టుకోవాలి? పాలకులుగా ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసి.. జిల్లాలుకావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి? 30 కానీ 40 కానీ.. వచ్చే నష్టమేమీ లేదు. జిల్లాలు ఎంత చిన్నవైతే.. అంత మంచిది’’ అంటూ కొత్త జిల్లాల మీద తన వైఖరిని చెప్పకనే చెప్పేశారు.
దేశంలో లక్ష లోపు జనాభా ఉన్న జిల్లాలు 28 వరకూ ఉన్నాయని.. ఐదు లక్షల లోపు జనాభా ఉన్న జిల్లాలు 72 ఉన్నాయంటూ.. చిన్న జిల్లాలు ఎంత ‘సిన్నగా’ ఉంటాయన్న విషయాన్ని తెలంగాణ అధికారపక్షం నేతలు చెప్పటం గమనార్హం. టీఆర్ ఎస్ నేత ప్రస్తావించిన ఈ గణాంకాల్నిసమర్థించిన సీఎం.. లక్షా.. ఐదు లక్షలు కాదు.. హిమాచల్ ప్రదేశ్.. నాగాలాండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో 10 వేల జనాభాతో జిల్లాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.
తాజాగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో ప్రతి జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా జిల్లాల్ని పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. జిల్లాల వారీగా ప్రతి ఒక్క కుటుంబం వివరాల్ని రికార్డు చేసి.. పేదరిక నిర్మూలన మీద ఫోకస్ చేస్తామని.. పేదరిక నిర్మూలనకు కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో సాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అంశాల్ని చూస్తే..
= మహబూబాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు అదే పేరు ఉంటుంది. వికారాబాద్ జిల్లాకు వికారాబాద్ పేరే ఉంచాలి.
= కొత్త గూడెం జిల్లాకు ‘భద్రాద్రి కొత్తగూడెం’ పేరు.. సిరిసిల్ల జిల్లాకు ‘రాజాద్రి’ పేరు పెట్టే అంశం పరిశీలించాలి.
= వరంగల్ రూరల్.. అర్బన్ జిల్లాల ఏర్పాటు
= జిల్లాలలో కలిపే మండలాల విషయంలో గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతూ.. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉన్నా.. వేరే జిల్లాలో ఉన్నా సరే అలాంటి వాటిని సమీప మండలంలో కలిపేలా చర్యలు తీసుకోవాలి
= ఒకప్పటి గోండుల రాజధానిగా ఉన్న అదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలి.
= వరంగల్ జిల్లా కేంద్రాన్ని వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలి.
= వివిధ జిల్లాలకు సంబంధించిన ఆయా మండలాలపై వచ్చిన అభ్యంతరాల్ని పరిశీలించి.. తగు రీతిలో జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/