Begin typing your search above and press return to search.

డిగ్రీ విద్యార్థుల‌కు టీ-స‌ర్కార్ షాకిచ్చిందే!

By:  Tupaki Desk   |   16 Aug 2017 10:47 AM GMT
డిగ్రీ విద్యార్థుల‌కు టీ-స‌ర్కార్ షాకిచ్చిందే!
X
తెలంగాణ‌లోని డిగ్రీ కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థులారా.. జాగ్ర‌త్త‌గా ఉండండి! స‌ర‌దాలు - షికార్లు - కాలేజీకి బంక్ కొట్టడాలు వీట‌న్నింటికీ టాటా - గుడ్‌ బై చెప్పేయండి. ఇప్ప‌టినుంచే వీట‌న్నింటినీ వ‌దిలేసి.. బుద్ధిగా పుస్తకం ప‌ట్టుకుని చ‌ద‌వండి!! ఇవ‌న్నీ ఎందుకంటారా.. తెలంగాణ ప్ర‌భుత్వం డిగ్రీ క‌ళాశాల‌ల్లో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇక నుంచి సెమిస్ట‌ర్‌ లో కనీసం 50 శాతం మార్కులు రాక‌పోతే.. రెండో సంవ‌త్స‌రంలోకి వెళ్లే అవ‌కాశం లేకుండా డిటెన్ష‌న్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తిస్థాయిలో వెలువ‌డ‌బోతున్నాయి.

మూడేళ్లు.. ఆరు సెమిస్ట‌ర్లు.. క‌ళ్లు మూసి తెరిచేలోగా ప‌రీక్ష‌లు.. కాలేజీకి ఎప్పుడు వ‌చ్చినా, ఎప్పుడు వెళ్లిపోయినా ప‌ట్టించుకునే వారు ఉండ‌రు.. ప‌రీక్ష‌ల టైమ్‌ లో పాస్ మార్కులు వ‌స్తే చాలు అన్న‌ట్లుగా చ‌దువులు!! ఇక నుంచి ఇలాంటిదేమీ ఉండ‌దు బాసు!! ఇక నుంచి విద్యావిధానాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌బోతోంది. సీబీఎస్ ఈ గ‌త ఏడాది ప్ర‌వేశ‌పెట్టిన డిటెన్ష‌న్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అన్ని డిగ్రీ క‌ళాశాల‌ల్లోనూ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దీనిపై అన్ని వ‌ర్సిటీల వీసీలు - తెలంగాణ స్టేట్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ కౌన్సిల్ ఈ విధానానికి ఆమోద‌ముద్ర వేసింది.

గ‌తంలో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల్లో 50 శాతం కంటే త‌క్కువ చ్చినా రెండో త‌ర‌గ‌తిలోకి పంపించేవారు. కానీ కొత్త నిబంధ‌న‌ ప్ర‌కారం ఒక విద్యార్థి ఏడాదిలో జ‌రిగే రెండు సెమిస్ట‌ర్‌ లో 50 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ప్ర‌తి విద్యార్థికి వ‌ర్తించ‌బోతోంది. అంతేగాక విద్యార్థి 75 శాతం అటెండెన్సు త‌ప్ప‌నిస‌రి చేశారు. కాగా ఈ నిర్ణ‌యంపై నిపుణులు అభ్యంత‌రాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఇది కొత్త‌గా డిగ్రీలో చేరిన 3 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం చూప‌డంతో పాటు ద్వితీయ‌ - తృతీయ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థుల భ‌విష్య‌త్‌ పై తీవ్రంగా ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.