Begin typing your search above and press return to search.

సోమేశ్ కుమార్ కు దిమ్మ‌తిరిగిపోయే ప‌రిస్థితి ఎదురైంది

By:  Tupaki Desk   |   27 Feb 2022 10:31 AM GMT
సోమేశ్ కుమార్ కు దిమ్మ‌తిరిగిపోయే ప‌రిస్థితి ఎదురైంది
X
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఊహించని రీతుల్లో ఇర‌కాటంలో ప‌డిపోయారు. ఏపీ సర్కార్ తనను రిలీవ్ చేసినా.. తెలంగాణ సర్కార్ విధుల్లోకి తీసుకోవడం లేదని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ (క్యాట్) దృష్టికి ఓ ఐపీఎస్ అధికారి తీసుకెళ్లడంతో ఆయ‌న ఆగ్ర‌హానికి గుర‌కావాల్సి వ‌చ్చింది.

తామిచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించింది. తామిచ్చిన ఆదేశాలతోనే ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్.. తెలంగాణ సీఎస్ గా ఉన్నారని క్యాట్ హైదరాబాద్ బెంచ్ గుర్తు చేసింది. అంతేకాదు ఇప్పుడు తమ ఆదేశాలను పాటించకపోతే ఇప్పటికిప్పుడే ఏపీకి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతోపాటు కోర్టు ధిక్కరణ కింద జైలు పంపిస్తామని కూడా క్యాట్ హెచ్చరించింది.

అధికార వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ప‌రిణామం వివ‌రాల్లోకి వెళితే, ఏపీ సర్కార్ తనను రిలీవ్ చేసినా.. తెలంగాణ సర్కార్ విధుల్లోకి తీసుకోవడం లేదని ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి క్యాట్ దృష్టికి తీసుకెళ్లారు. పలు అంశాలను ఐపీఎస్ అభిషేకం మహంతికి క్యాట్ కు వివరించారు.

ఐఏఎస్ శ్రీలక్ష్మీని క్యాట్ ఆదేశాలతో ఏపీకి ఐదు రోజుల్లో రిలీవ్ చేశారని దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కో అధికారి కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరి వివక్ష కనిపిస్తోందని అభిషేక్ మొహంతి క్యాట్ కు వివరించారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ శుక్ర‌వారం క్యాట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో క్యాట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ వెంటనే వర్చువల్ విధానంలో హాజరు కావాలని క్యాట్ హైదరాబాద్ బెంచ్ తేల్చిచెప్పింది. దీంతో గంట సేపట్లో క్యాట్ విచారణకు హాజరయ్యారు. మార్చి 11లోపు అభిషేక్ మొహంతికి పోస్టింగ్ ఇవ్వాలని.. అదేరోజు విచారణకు హాజరుకావాలని క్యాట్ హైదరాబాద్ బెంచ్ ఆదేశించింది.

కాగా, ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ విష‌యంలో సీఎస్ సోమేశ్ కుమార్‌కు `పై నుంచి` ఆదేశాలు రాక‌పోవ‌డంతోనే ఆయ‌న పోస్టింగ్ ఇవ్వ‌లేక‌పోయార‌ని, దీంతో ఆయ‌న క్యాట్ ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.