Begin typing your search above and press return to search.
కొత్త కల్చర్: ఇప్పుడే ఇంత పొగిడేస్తున్నారు.. ఫ్యూచర్ సంగతేంటి?
By: Tupaki Desk | 11 Jun 2023 4:10 PM GMTఉన్నది ఉన్నట్లుగా చెప్పటం తప్పు కాదు. కొన్ని స్థానాల్లో ఉన్న వారి మాటలు తూకం వేసినట్లుగా మాట్లాడాలే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే వ్యవస్థలకే చేటుగా మారుతుంది. తాము పని చేస్తున్నది ప్రభుత్వాలకు కాదు.. ప్రజలకు అన్న సోయి అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారుల్లో పోయి చాలాకాలమే అయ్యింది. ఇప్పుడున్నంత భజన.. గతంలో మరెప్పుడూ లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని విపరీతాలు చూసినప్పుడు.. ఇదంతా ఎక్కడికి వెళ్లనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రభుత్వాల్లోనూ.. పాలనలోనూ కీలక భూమిక పోషించే వారు తామరాకు మీద నీటిబొట్టు మాదిరి ఉండాలే తప్పించి.. ఐదేళ్ల పరిమిత కాలానికి ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వాల పట్ల అపరిమితమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శించటమే అసలు తలనొప్పి. జరిగిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం.. వివరాలు అందించటం తప్పేం కాదు.. అది బాధ్యత కూడా. కానీ.. అందుకు భిన్నంగా విశేషణాలతో పొగడ్తల వర్షం కురిపించటంతోనే అసలు సమస్యంతా. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొందరు అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు.. ఇస్తున్న ప్రకటనలు.. మాట్లాడుతున్న మాటల్ని చూసినప్పుడు ముక్కున వేలేసుకోవాల్సిందే.
తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శాంతికుమారి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాల్ని క్రియేట్ చేశామని.. దేశంలో మరే రాష్ట్రం సాధించని డెవలప్ మెంట్ ను తెలంగాణ సాధించిందని పేర్కొన్నారు. ఈ మాటల్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్య అధికారిగా.. ప్రభుత్వం తరఫున పని చేసే సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. అసలు అభ్యంతరంగా.. ఆ తర్వాత ఆమె మాట్లాడిన మాటలతోనే. ఆమె ఏమన్నారంటే.. ''నా 34 ఏళ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన.. జరుగుతున్న డెవలప్ మెంట్ ను గతంలో చూడలేదు'' అని వ్యాఖ్యానించారు. ఒకవేళ.. అదే నిజమని అనుకుందాం. గతంలో సరిగా డెవలప్ మెంట్ జరగటం లేదన్న అసంత్రప్తిని ఇప్పటివరకు వ్యక్తం చేయటం చూడలేదు.
వ్యవస్థలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న వారు ఈ తరహా ప్రకటనలు చేసిన తర్వాత.. ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒకవేళ.. వారి మాటలకు భిన్నంగా ప్రజాభిప్రాయం ఉండి.. ప్రభుత్వం మారిందని అనుకుందాం. అప్పుడు వీరి పరిస్థితి ఏమిటి? అయినా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ తరహా మాటలు దేనికి నిదర్శనం? ప్రభుత్వం చేసే మంచిపనులు చెప్పొద్దని చెప్పట్లేదు. కానీ.. పొగడటం.. విశేషణాలతో వ్యాఖ్యలు చేయటంతోనే అసలు ఇబ్బంది. ఈ తరహా కల్చర్ పెరిగేకొద్దీ.. అధికారులు ప్రజలకు కాకుండా.. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే వారికి అనుగుణంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు. కానీ.. ఇటీవల కాలంలో అలాంటి విషయాలనకు ప్రాధాన్యత ఇవ్వని తీరు రానున్న రోజుల్లో మరెలాంటి విపరీతాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.