Begin typing your search above and press return to search.

తెలంగాణలో కొత్తగా 1,597 పాజిటివ్.. 11మంది మృతి

By:  Tupaki Desk   |   15 July 2020 5:37 PM GMT
తెలంగాణలో కొత్తగా 1,597 పాజిటివ్.. 11మంది మృతి
X
మహమ్మారి వైరస్ తెలంగాణలో తీవ్ర స్థాయిలోనే విజృంభిస్తోంది. రోజు 1,500కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బుధవారం 1,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది వైరస్ తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 39,342కి చేరగా.. మొత్తం మృతులు 386 మంది ఉన్నారు. తాజాగా వైరస్ బారిన పడి కోలుకున్న వారు 1,159 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 12,958.

తెలంగాణ ప్రభుత్వం రెండు వారాలుగా టెస్టులు భారీగా పెంచింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 13,642 నమూనాలు పరీక్షించారు. కేసులు యథావిధిగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి.. మేడ్చల్.. సంగారెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అధిక కేసులు నమోదవుతున్నాయి. వీటితో పాటు మిగతా జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.