Begin typing your search above and press return to search.
బిల్స్ ఇవ్వకుంటే తెలంగాణ కాంట్రాక్టర్స్ చేతులు ఎత్తేస్తాం అంటున్నారా?
By: Tupaki Desk | 1 Sep 2020 5:45 AM GMTమొన్నటి వరదలకు మునిగిన వరంగల్ నగరానికి 25 కోట్లుకుపైగానే కేటాయించి పనులన్నీ చేస్తానని.. మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. నగరంలో పర్యటించి ఆక్రమణలు, కబ్జాలు కూల్చివేయించారు. అయితే రూ.25 కోట్లతో నగరం సుందరంగా అవుతుందని అంతా భావించారు. కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు నిధులు లేవు.. విడుదల కాకుండా ఓరుగల్లులో పనులు పడకేశాయట..
దేశంలో సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి దుస్థితి చూసి అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. రూ.25 కోట్లు ప్రకటించి కూడా నిధులు విడుదల చేయలేదా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టర్స్ కు డబ్బులు రావడం లేదట. ఇలా అయితే ఎలా పనిచేయాలని లోకల్ ఎమ్మెల్యేలను కాంట్రాక్టర్స్ నిలదీస్తున్నారంటా.. ఇలా అయితే పనులు మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారట..
నిధులు ఇవ్వకుండా పనులు ఎవరూ చేయరని.. ఇలా అయితే వరంగల్ ఎలా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం మీడియా మిత్రులకు చెబుతూ వాపోతున్నారట.. వరంగల్ లో ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఉందని.. ఎక్కడ చూసినా వరంగల్ లో ఇదే చర్చ నడుస్తోందని టాక్.