Begin typing your search above and press return to search.
అప్పుల కుప్ప..బడ్జెట్ కాంగ్రెస్ ఛార్జ్ షీట్
By: Tupaki Desk | 12 Feb 2023 1:14 PM GMTప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ఒక్కో రంగంపై చార్జ్ షీట్ విడుదల చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుల కుప్పగా ఉందని వర్ణించింది. ఈ మేరకు ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బడ్జెట్ పై చార్జ్ షీట్ ను గాంధీభవన్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేకుండా బడ్జెట్ ను రూపొందించారన్నారు. గత బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు ప్రవేశపెట్టినా.. వాస్తవ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు ఉందన్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఉండడంతో బడ్జెట్ ను పెంచినట్లు ప్రతిపాదించినా.. అందులో 70 శాతం కూడా ఖర్చు చేయలేరని విమర్శించారు.
కేసీఆర్ బడ్జెట్ ను గతంలోనే కాగ్ తప్పు పట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తుుల కల్పనపై దృష్టి సారించడం లేదన్నారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ ను కేటాయించినా వాటిని ఖర్చు చేస్తారన్న గ్యారంటీ లేదన్నారు. గతంలో దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించారన్నారు. అందులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదే బడ్జెట్ ను రిపీట్ చేశారన్నారు.
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేస్తారని అనుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. రైతులకు రణమాఫీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీల కు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి వాటిని పట్టించకోలేదన్నారు. అయితే బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తున్నామని కాగితాల వరకే పరిమితం చేస్తారని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులకు రుణాల పేరిట ప్రభుత్వం లక్షన్నర కోట్ల వరకు అప్పులు చేసిందని విమర్శించిదన్నారు. కానీ విద్య, వైద్యం, గిరిజన బంధు వంటి సంక్షేమ పథకాలను పట్టించుకోకపోవడం విడ్డూరమని విమర్శించారు. గత బడ్జెట్ లోనే నిధులు ఖర్చుచేయలేదంటే.. ఈసారి బడ్జెట్ ను పెంచడం హస్యాస్పదమని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.