Begin typing your search above and press return to search.
ఇది శ్రీకారం : రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల గుర్రు!
By: Tupaki Desk | 30 Oct 2017 4:33 AM GMTఎన్నాళ్లనుంచో నానా కష్టాలు పడి.. ఒక పండును పండిస్తే.. హఠాత్తుగా గద్ద వచ్చి ఆ పండును ముక్కున కరచుకుని వెళ్లిపోతే ఎంతగా కడుపు మండుతుంది? తెలంగాణలోని చాలా మంది కాంగ్రెస్ సీనియర్ల పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇలాగే ఉంది. అందుకే వారు కొత్తగా తమ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలోకి రాకముందే.. ఆయనకు అక్కడ వ్యతిరేక ముఠాలు తయారయిపోతున్నాయనడానికి ఇది ఉదాహరణ. అయితే ఆయన మీద కోప్పడుతున్న కాంగ్రెస్ సీనియర్ల ఆవేదనలో కూడా అర్థం ఉందనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా చాలాకాలంగా కేసీఆర్ సర్కారు మీద అనేక రకాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలుసు. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాల విషయంలో వారు అలుపెరగని పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి.. తమ సత్తా ఏమిటో ప్రజలకు చాటాలని కూడా వారు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టకేలకు వరంగల్ వేదికగా గిరిజన గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అంతా రెడీ అయింది.
అయితే ఈలోగా కాంగ్రెస్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఎంట్రీతో నాయకుల ప్రాధాన్యాలు కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ స్వయంగా వరంగల్ వేదికను మహబూబ్ నగర్ కు మార్చేయాల్సిందిగా పురమాయించారట. ఇన్నాళ్లు కష్టపడి వరంగల్ లో సభ నిర్వహణకు అనుకుంటే.. ఇప్పుడు రేవంత్ వచ్చి ఆ సభ ను కాస్తా మహబూబ్ నగర్ కు తన్నుకు పోయాడని వారికి ఆగ్రహం కలుగుతోంది. రేవంత్ కు , రాహుల్ ఎదుట తన బలాన్ని ప్రదర్శించాలని అంతగా కోరికగా ఉంటే.. ఈ సభను వదిలేసి.. తానుగా మరో సభ నిర్వహించి అప్పుడు సత్తా చాటి ఉండాల్సిందని.. ఈ సభకోసం తమ కష్టాన్నంతా ఆయన దోచుకుని, తన సంపదగా చూపించుకునే ప్రయత్నంలాగా ఇది ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే సీనియర్లు కొందరు, ప్రధానంగా ముందునుంచి రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్న వారు ఈ నెపం చూపి... బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది.