Begin typing your search above and press return to search.

బీటలు వారుతున్న మహాకూటమి..కారణమిదే..

By:  Tupaki Desk   |   18 Sep 2018 10:50 AM GMT
బీటలు వారుతున్న మహాకూటమి..కారణమిదే..
X
మహాకూటమి ఏర్పాటులో నాన్చివేత.. టీఆర్ ఎస్ కు ఆయాచిత వరమవుతోంది. ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి సీట్లు ప్రకటించేసి ప్రచారం మొదలెట్టేసిన కేసీఆర్ స్పీడును తెలంగాణలో ప్రతిపక్షాలు అందుకునే పరిస్థితిలో లేవు. కాంగ్రెస్ సహా మిగతా పక్షాలు ఇప్పటికీ సీట్లు - పొత్తుల ఖరారుపైనే కూర్చుంటే టీఆర్ ఎస్ అభ్యర్థులు మాత్రం గ్రామాలను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ముందే సగం గ్రామాల్లో ప్రచారం పూర్తి చేయాలని కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు అల్టీమేటం జారీ చేశారట.. గులాబీ దండు ప్రచారంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం మహాకూటమికి పరిపూర్ణ రూపం ఇవ్వలేక సతమతమవుతోందట..

తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ మహాకూటమికి స్కెచ్ గీసింది. టీడీపీ - సీపీఐ - కోదండరాం టీజేఎస్ ను కూటమిలో భాగస్వాములు చేయడంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సక్సెస్ అయ్యారు. తొలి మీటింగ్ పూర్తై ఇప్పుడు రెండో దశ టికెట్ల కేటాయింపు మీటింగ్ పెట్టుకుందామంటే టీడీపీ - టీజేసీల డిమాండ్లతో కాంగ్రెస్ ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది.

మహాకూటమిలో టీజేఎస్ కోదండరాం అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట.. మహాకూటమికి కామన్ మినిమం ప్రోగ్రాం ఉండాలని ఆ కమిటీకి తానే చైర్మన్ గా ఉంటానని కోదండ డిమాండ్ చేస్తున్నాడట.. ఆ మేనిఫెస్టో తయారయ్యాకే అభ్యర్థుల గురించి తేల్చుదామని మెలిక పెడుతున్నాడట.. ముందు సీట్ల సర్దుబాటు చేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నా కోదండరాం నుంచి రెస్పాన్స్ రావడం లేదట.

దీంతో సీట్ల సర్దు బాటు అంశాన్ని ఎలా కొలిక్కి తేవాలన్న అంశం కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారింది. టీడీపీ మాత్రమే కాదు.. టీజేఎస్ కూడా తమకు పదుల సంఖ్యలో సీట్లు డిమాండ్ చేయడమే కూటమి ఆలస్యానికి కారణంగా కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కూటమి పొత్తులో కాంగ్రెస్ గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారట..దీంతో భారీగా సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు మిత్రపక్షాలకు ఇప్పటికే చెప్పారట.. కానీ ఈ విషయంలో కోదండరాం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు టీడీపీ కూడా భారీ సంఖ్యలో సీట్లను డిమాండ్ చేస్తోంది. దీంతో పొత్తుల వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతోందట.. దీంతో మహాకూటమిని గ్రాండ్ గా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పెద్దలు సీట్లు సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారట.. ఈ పరిణామాలతో మహాకూటమి ముందుకుసాగడం కష్టమని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.