Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ దుకూడు

By:  Tupaki Desk   |   24 July 2018 5:44 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్ దుకూడు
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకూడు మరింతగా పెంచుతోంది. లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంశంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం - పార్టీ ప్లీనారిలో తీసుకున్న నిర‌్ణయాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలను నిర్వహించాలనుకుంటోంది. ముందుగా ఆగష్ట్ నెలలో రంగారెడ్డి - హైదారబాద్ జిల్లాలో ఎక్కడో ఒక చోట భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. రంజాన్ కారణంగా గత నెలలో నిలిపివేసిన బస్సు యాత్రను ఆగష్ట్ నెలలో తిరిగి కొనసాగించాలనుకుంటున్నారు. యాత్ర ఎప్పుడు ప్రారంభం కావాలి ,ఎక్కడెక్కడ పర్యటించాలి - యాత్రకు అధిష్టానం నుంచి ఎవరెవరిని ఆహ్వానించాలి వంటి నిర్ణయాలను తీసుకుందుకు తెలంగాణ పీసీసీ సభ్యులు బుధవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవాహారాల ఇన్‌ చార్జ్ రామచంద్ర ఖుంటియా కూడా హాజారుకానున్నారు. ఈ ‍భేటి అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీకి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్ర సమితి వాదనలను తిప్పి కొట్టాలని పార్టీ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడి పరిశ్రమలు తరలి పోతాయన్న తెరాస ఎంపీల వాదనలో వాస్తవం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో స్ధిరపడిపోయిన పరిశ్రమలు ఎలా వెళ్లిపోతాయ్ - ఆ పరిశ్రమలకు బ్రాంచీలుగా మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ లో రావచ్చు " అని టి. కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను - కేంద్రంలోను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మరింతా అభివ్రుధ్ది జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీని కోసం తెలంగాణలో వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.