Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌...ఉద్య‌మ‌కారుల‌ను అవ‌మానించిన పార్టీ

By:  Tupaki Desk   |   9 Nov 2018 9:22 AM GMT
కాంగ్రెస్‌...ఉద్య‌మ‌కారుల‌ను అవ‌మానించిన పార్టీ
X
కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని మ‌హాకూటమిలో సీట్ల ఖ‌రారు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ప్ప‌టికీ - ఆ పార్టీలో అంత‌ర్గ‌త అసంతృప్తులు భ‌గ్గుమంటున్నాయి. త‌మ‌కు తీవ్ర నిరాశ‌ను - అవ‌మానాన్ని క‌లిగించార‌ని ప‌లు వ‌ర్గాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కొత్త ఆరోప‌ణ‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. కాంగ్రెస్‌...ఉద్య‌మ‌కారుల‌ను అవ‌మానించిన పార్టీ అంటూ ప‌లువురు నేత‌లు భ‌గ్గుమంటున్నారు. సుదీర్ఘ చర్చలు - నిరసనలు - నిట్టూర్పులు - అల్టిమేటంల తర్వాత నాలుగు పార్టీలు ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. సీట్ల కేటాయింపుల విషయంలో లీక్‌ లతో మిత్రులను మానసిక క్షోభకు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీ తన గేమ్‌ ప్లాన్‌ లో విజయం సాధించింది. కూటమిలో పొత్తులు ఖరారైనట్టు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి ఆర్‌సీ కుంతియా గురువారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. నాలుగు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం కాంగ్రెస్‌ 93 - టీడీపీ 14 - టీజేఎస్‌ 8 - సీపీఐ 3 - తెలంగాణ ఇంటి పార్టీ 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. దాదాపు ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని మిత్ర పక్షాలు భావిస్తున్నప్పటికీ పోటీ చేసే స్థానాల సంఖ్య విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు టీడీపీ - టీజేఎస్‌ లు ధృవీకరించాయి. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది.

మహాకూటమిలో పొత్తులు ఖరారయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోని ప‌లువురు నేత‌లు భ‌గ్గుమంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన దాసోజు శ్రావణ్ - అద్దంకి దయాకర్ - బెల్యానాయక్ - కత్తి వెంకటస్వామి - ఇందిరాశోభన్ కు ఎక్కడా సీట్లు కేటాయించలేదు.ఖైరతాబాదు నుండి దాసోజు శ్రావణ్ - తుంగతుర్తి నుండి అద్దంకి దయాకర్ - మహబూబా బాద్ నుండి బెల్యానాయక్ - ముషీరాబాద్ నుంచి ఇందిరా శోభన్ గౌడ్ టికెట్లు ఆశిస్తున్నారు. అయితే, వారికి టికెట్లు ద‌క్కలేదు.దీంతో ఇదేనా ఉద్య‌మ‌కారుల‌కు కాంగ్రెస్ ఇచ్చే గౌర‌వం అంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో మండిప‌డుతున్నారు.

ఓ వైపు ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ఆవేద‌న చెందుతుంటే...మ‌రోవైపు అనుబంధ సంఘాల నాయ‌కులు సైతం అదే రీతిలో అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన ఎన్ ఎస్‌ యూఐ - మహిళా కాంగ్రెస్ నేతలకు టికెట్లు ద‌క్క‌లేదు. మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు నేరెళ్ళ శారద కరీంనగర్ నుంచి, ఎన్ ఎస్‌ యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బల్మూర్ వెంకట్ పెద్దపల్లి నుండి టికెట్ ఆశించారు. అయితే, వారికి నిరాశ ఎదురైంది. దీంతో ఇటు అనుబంధ సంఘాల‌కు ఇవ్వ‌కుండా...అటు ఉద్య‌మ‌కారుల‌కు కాంగ్రెస్ చిన్న‌చూపు చూసింద‌ని ప‌లువురు భ‌గ్గుమంటున్నారు.