Begin typing your search above and press return to search.

రేవంత్‌ పై అప్పుడే కాంగ్రెస్‌ లో డౌట్లు మొద‌ల‌య్యాయి

By:  Tupaki Desk   |   22 Oct 2017 1:30 AM GMT
రేవంత్‌ పై అప్పుడే కాంగ్రెస్‌ లో డౌట్లు మొద‌ల‌య్యాయి
X
టీటీ­డీపీ వర్కింగ్‌ ప్రెసి­డెంట్‌ - కొడం­గల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి పార్టీ మారు­తున్నారన్న ప్రచారం తారాస్థాయికి చేరిన స‌మ‌యంలోనే...కొత్త చ‌ర్చ‌లు మొద‌లయ్యాయి. మాటకారితనంతో ప్రాచుర్యం - రాష్ట్రస్థాయి పదవి పొందిన రేవంత్‌ రెడ్డి ప్రభావంపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా - ఎక్కడా ఆయ­నకు ప్రత్యే­క­మైన క్యాడర్‌ అంటూ లేనే­లేదు. ఆయా నియో­జ­క­వ­ర్గాల్లో అక్కడి నాయ­కులే ఉన్నారు. టీడీ­పీలో ఉన్న­ప్పుడు మాత్రమే ఆయ­నకు గుర్తింపు ఉండింది. కాంగ్రె­స్‌ లో చేరితే అదొక సముద్రం. అక్కడ తిమిం­గ­లా­లు ఉంటాటాయి. రేవం­త్‌­ లాంటి చేప­లను సునా­యా­సంగా మింగే­స్తా­యని కూడా చర్చిం­చు­కుం­టు­న్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా రేవంత్‌ రెడ్డి కన్నా సీనియర్లే.

ఉమ్మడి పాల­మూ­రులో మహ­బూ­బ్‌­ న­గ­ర్‌­ - జడ్చర్ల - నారా­య­ణ­పేట - మక్తల్‌ - కల్వ­కుర్తి - గద్వాల - అలం­పూర్‌ - దేవ­ర­కద్ర - వన­పర్తి - నాగ­ర్‌­ క­ర్నూల్‌ - అచ్చం­పేట - కొల్లా­పూర్‌ - కొడం­గల్‌ - షాద్‌­ న­గర్‌ అసెం­బ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్తుతం షాద్‌­ న­గర్‌ - కొడం­గ­ల్‌­ లోని కొంతభాగం వికా­రా­బాద్‌ జిల్లా­లో చేరాయి. మిగి­లిన తాలూ­కా­లన్నీ యథా­వి­ధిగా ఉన్నాయి. రేవంత్‌ రెడ్డి సొంత నియో­జ­క­వ­ర్గ­మైన కల్వ­కు­ర్తిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వంశీ­చంద్‌ రెడ్డి ఎమ్మె­ల్యేగా కొన­సా­గు­తు­న్నారు. గద్వాల - వన­పర్తి - అలం­పూ­ర్‌­ ల­లోను డీకే అరుణ - జిల్లెల చిన్నా­రెడ్డి - సంపత్‌ కుమా­ర్‌ కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యేలుగా కొన­సా­గు­తు­న్నారు. మిగి­లినచోట్ల కాంగ్రె­స్‌ కు ఎమ్మె­ల్యేలు లేకున్నా ఆయా నియో­జ­క­వర్గ ఇన్‌­ చా­ర్జీలు­న్నారు. ఈ స్థానాల్లో ఎటుచూసినా రేవంత్‌ రెడ్డి ప్రభావం మచ్చు­కైనా కని­పిం­చదు. పాల­మూరు నుంచి టీడీపీ ముఖ్య­నే­తలు రేవంత్‌ రెడ్డి వెంటవెళ్లే సంగ­తేమోకానీ - ఆయన సొంత నియోజకవర్గంలోనే తమ్ముళ్లు టీడీ­పీని వీడుతున్నారు.

టీడీపీ సీని­య­ర్లు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి - కొత్త­కోట దయా­క­ర్‌­ రెడ్డి దంప­తులు - ఎర్ర శేఖ­ర్‌ స్వతం­త్రంగా పనిచేసినవారే తప్ప రేవంత్‌ రెడ్డిపై ఆధార‌­పడిన చరిత్ర లేదు. నేరుగా చంద్ర­బా­బు­తోనే సంబం­ధా­లు­న్నాయి. రేవం­త్‌ తో సఖ్యత అంతంత మాత్రమే. ఇతరప్రాంతాల నుంచి రేవంత్‌ వెంట కాంగ్రె­స్‌­ లోకి వెళ్తా­రన్న ప్రచారాన్ని రాజకీయ విశ్లేషకులు విచి­త్రం­గా చూస్తు­న్నారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్‌ అంతా టీఆ­ర్‌­ ఎస్‌ గూటికి చేరింది. రేవంత్‌ రెడ్డి సొంత నియో­జ­క­వ­ర్గం­లోని టీడీపీ క్యాడర్‌ కూడా ఇటీ­వలే టీఆ­ర్‌­ ఎస్‌ తీర్థం పుచ్చు­కు­న్నారు. దీంతో అసలు రేవంత్‌ రెడ్డికి క్యాడర్‌ ఎక్కడ, ఎంత ఉన్నదన్న ప్రశ్నలు చర్చ­నీ­యాం­శ­మ­య్యాయి. రేవంత్‌ కాంగ్రె­స్‌­ లో చేరతారన్న దానిపై రెండురకాల వాద­నలు కాంగ్రె­స్‌­లోనే విని­పి­స్తు­న్నాయి. ఒకవర్గం నుంచి సాను­కూ­లత కని­పిస్తే, మరోవర్గం నుంచి వ్యతి­రేక ధోరణి విని­పి­స్తు­న్నది. ‘ధీశాలి.. గట్టి నాయ­కు­డు’ అంటూ సంబో­ధిం­చటం కూడా కాంగ్రె­స్‌ లో అంద­రికీ నచ్చ­టం­లేదు. రేవంత్‌ కాంగ్రె­స్‌ లో చేరి­తే­గాని అసలు సీన్‌ బయటపడద‌ని అంటున్నారు.