Begin typing your search above and press return to search.
కేసీఆర్ లెక్కలతోనే కాంగ్రెస్ ఆయన్ను చిత్తు చేస్తుందట
By: Tupaki Desk | 3 March 2018 4:21 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన లెక్కలతోనే చిత్తు చేసేందుకు ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందా? ఏ సమీకరణాల ఆధారంగా తన బలం పెంచుకునేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారో అదే బలం ద్వారా ఆయన్ను బుక్ చేసేందుకు రెడీ అవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు రాజ్యసభ ఎన్నికలను కాంగ్రెస్ రెడీ చేసుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తగిన బలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టేందుకు అధికార టీఆర్ ఎస్ ప్రయత్నిస్తుండగా...అమరవీరుల కుటుంబాలకు చెందిన వ్యక్తిని బరిలోకి దించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగానే అమరవీరుల కుటుంబ సభ్యులకు సీటు కేటాయించాలని అధికార టీఆర్ ఎస్ ను ఇప్పటికే నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నెలాఖరులో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఆ మూడింటిని కైవసం చేసుకునేందుకు టీఆర్ ఎస్ పావులు కదుపుతోంది. అధికార పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా రెండు రాజ్యసభ సీట్లు దక్కుతాయి. కాంగ్రెస్ - టీడీపీ - వైసీపీ - సీపీఐ పార్టీల నుండి తమ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్యతో మూడో సీటును దక్కించుకునేందుకు టీఆర్ ఎస్ ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. మూడో అభ్యర్థిగా కేసీఆర్ సమీప బంధువు - టీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ రావును నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మూడో సీటును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీఆర్ ఎస్ ను నిలువరించాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మూడో సీటును అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టత ఇస్తే మద్దతు ఇవ్వాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీయే ఆ కుటుంబాలను నుంచి ఒక వ్యక్తిని బరిలోకి దించాలని యోచిస్తోంది.
అయితే తమ ప్రతిపాదనకు కేసీఆర్ ఒప్పుకొనే చాన్స్ లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇప్పటికే ఆ పార్టీ నేతలు అభ్యర్థుల వేటలో పడ్డట్లు సమాచారం. పోటీ పెట్టడం ద్వారా కేసీఆర్ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.