Begin typing your search above and press return to search.

ఓరుగల్లు మీద ఒట్టు...అధికారం ఆ పార్టీదే...?

By:  Tupaki Desk   |   2 May 2022 10:30 AM GMT
ఓరుగల్లు మీద ఒట్టు...అధికారం ఆ పార్టీదే...?
X
ఓరుగల్లు అంటే పోరుగల్లు అని కూడా చెబుతారు. ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశం ఇది. రాజకీయంగా చూసుకున్నా చాలా కీలకమైన ప్రాంతం. నిత్య చైతన్యం తొణికిసలాడే ప్రదేశం కూడా ఇదే. అలాంటి ఓరుగల్లుకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. ఇక రాజకీయాలు అంటేనే సెంటిమెంట్ చాలా ఎక్కువ.

తెలంగాణాలో ఓరుగల్లు మీద రాజకీయ నేతలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. తన పోరాటాలకు అనేక సార్లు ఓరుగల్లుని వేదిక చేసుకుని ఇంటా రచ్చా గెలిచిన చరిత్ర గులాబీ పార్టీకి ఉంది. ఇక విభజన తెలంగాణాలో కూడా ఓరుగల్లు ప్రాముఖ్యతను గుర్తించి అదే తీరున పొలిటికల్ గా దూకుడు చేస్తోంది టీయారెస్.

ఇపుడు చూస్తే కాంగ్రెస్ కూడా పాత సెంటిమెంట్ ని బయటకు తీస్తోంది. ఓరుగల్లు తమకు కూడా వరాల జల్లు కురిపించే ప్రదేశం అని హస్తం నేతలు గతం నెమరేసుకుంటున్నారు. అంతే రాహుల్ గాంధీ పాల్గొనే సభకు వేదికగా ఓరుగల్లుని డిసైడ్ చేశారు.

ఓరుగల్లు హిస్టరీ చూస్తే కాంగ్రెస్ ఓడి వాడి 2004 కి ముందు చాలా ఇబ్బందుల్లో ఉంది. నాడు ఓరుగల్లులో సోనియా గాంధీ మీటింగ్ పెట్టించారు కాంగ్రెస్ నేతలు. ఆ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో పాటు జనాలు కూడా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాడు ఉమ్మడి ఏపీలో ఉన్న టీడీపీ సర్కార్ ఓడి వైఎస్సార్ ఆద్వర్యాన కాంగ్రెస్ గెలిచించి.

అలాగే మొత్తం 42 ఎంపీ సీట్లలో కూడా మెజారిటీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుని కేంద్రంలో యూపీయే వన్ లో కీలకమైన పాత్ర పోషించింది. అలా కేంద్రంలో సోనియమ్మ పట్టుదల్తో సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. అలా కాంగ్రెస్ గీత, రాత మార్చిన చరిత్ర ఓరుగల్లుకు ఉంది.

దాంతో ఇపుడు సోనియాగాంధీ తనయుడు కూడా ఓరుగల్లు నుంచే తొడగొట్టి మరీ గులాబీ పార్టీని పడగొడతారు అని అని అంటున్నారు. ఈ నెల 6న తెలంగాణాకు వస్తున్న రాహుల్ ఓరుగల్లు గడ్డ మీద నుంచే అధికార టీయారెస్ కి గట్టి వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. అలాగే ఎపుడు ఎన్నికలు జరిగినా వచ్చేది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే అని కూడా ఆయన బల్ల గుద్ది మరీ చెబుతారు అంటున్నారు.

మొత్తంగా చూస్తే ఓరుగల్లు గేట్ వే ఆఫ్ కాంగ్రెస్ విక్టరీగా ఆ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఇక్కడ సభను సూపర్ హిట్ చేయడానికి తన వయసును సైతం పక్కన పెట్టి వీ హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా శ్రమిస్తున్నారు. ఇక యువ నేత రేవంత్ ఉత్సాహం అయితే చెప్పనలవి కాదు. మరి సభ సూపర్ హిట్ అయితే ఆ దూకుడుతో టీయారెస్ మీద ఒక్క లెక్కన కాంగ్రెస్ నేతలు రెచ్చిపోవడం ఖాయం. మరి దానికి కావాల్సిన బలం, రాజకీయ ఇంధనం ఓరుగల్లు ఇస్తుందా. వెయిట్ అండ్ సీ.