Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ ‘ఎంపీ’.. బీజేపీలోకి జంప్ నా?

By:  Tupaki Desk   |   9 Nov 2020 9:30 AM GMT
టీ కాంగ్రెస్ ‘ఎంపీ’.. బీజేపీలోకి జంప్ నా?
X
ఏమో గుర్రం ఎగురావచ్చు. దుబ్బాకలో బీజేపీ గెలవనూ వచ్చు అంటున్నారు అక్కడి పరిస్థితులు చూసినవారు.. కానీ టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ గెలిస్తే మాత్రం సంచలనమే. 2024 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారానికి ఇదే ఆయుధమై నిలుస్తుంది. అదే జరిగితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వలసలు పెద్ద ఎత్తున కొనసాగి బీజేపీ బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పటికే విజయశాంతికి గాలం వేసిన బీజేపీకి ఇప్పుడు దుబ్బాకలో కనుక గెలిస్తే మరింత బూస్ట్ దక్కుతుంది. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఓ పెద్ద తలకాయ బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నాడట.. ఎవరాయన.. ఏంటా కథ అనేది తెలుసుకుందాం.

దుబ్బాకలో కనుక బీజేపీ గెలిస్తే.. తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలున్నాయని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయానికి వస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ మీద కొంచెం ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. కానీ ఎంత ఉందనేది మాత్రం తెలియడం లేదు. దుబ్బాక ఎన్నికల తర్వాత ఆ లెక్క తెలుస్తుందని.. ఆ ఎన్నికల ఫలితాల కోసం యావత్ తెలంగాణ ప్రజలు, పార్టీలు, నేతలు ఎదురుచూస్తున్నారట..

అయితే దుబ్బాక ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల్లో ఒక ఎంపీ బీజేపీలోకి చేరే చాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో క్యాడర్ ఉంది కానీ.. వాళ్లను నడిపించే నాయకుడు లేడు అని.. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కాంగ్రెస్ లీడర్స్ కు పెద్ద సపోర్ట్ లేదు అని.. కష్టం మాది తరువాత అనుభవించేది హైకమాండ్ అని... ఇలా అయితే పార్టీ బతకడం కష్టం అని ఆ ఎంపీ అనుకుంటున్నాడట..

అదే బీజేపీ అయితే కింది స్థాయి నాయకులను కూడా గుర్తించి పదవులు ఇస్తుందని.. అందుకే కాంగ్రెస్ లో ఒక ఎంపీ బీజేపీలో చేరే ఆలోచన చేస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చకు దారితీసిందట..

మరి ఆ ఎంపీ ఎవరు అని కూడా కొందరు ఆరా తీస్తున్నారట.. చూడాలి మరి ఇది నిజమా? లేక కల్పితమా? ఎన్నికల తరువాత ఏం జరుగుతుందనేది వేచిచూడాలి. అప్పటికి కానీ బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.