Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో లీక్‌... హామీల వ‌ర‌ద ఇదే!

By:  Tupaki Desk   |   5 July 2023 11:00 PM GMT
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో లీక్‌... హామీల వ‌ర‌ద ఇదే!
X
వ‌చ్చే నాలుగు మాసాల్లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. విజ‌య‌బావుటా ఎగుర‌వేయాల‌ని చూస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై కొన్నాళ్లుగా తీవ్ర అంత‌ర్మ‌థ‌నం చేస్తోంది. కీల‌క హామీల‌ ను చేరుస్తూ.. ప్ర‌జ‌ల‌ ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీని పై ఏకంగా.. ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ప‌ర్య‌టించి వ‌చ్చారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా అధికారం లోకి వ‌చ్చిందో వారు తెలుసుకున్నారు.

వాటితోపాటు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌ లో కాంగ్రెస్ గ‌త మే లో అధికారం లోకి వ‌చ్చిన వైనం.. అక్క‌డ ప్ర‌క‌టించిన మేనిఫెస్టో వంటివాటిని ప‌రిశీలించి.. తెలంగాణ కు కూడా ఒక మేనిఫెస్టో రూపొందించారు. అయితే.. ఈ మేనిఫెస్టో లోని కీల‌క అంశాలు.. ఇప్పుడు సోష‌ల్ మీడియా లో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. స‌ద‌రు నాయ‌కుడు ఉన్న‌త స్థాయి నాయ‌కుల‌కు పంపించ‌బోయి.. పొర‌పాటున సోష‌ల్ మీడియా గ్రూపుల‌ కు షేర్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో లోని కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు పొక్కాయి.

ఇవీ.. హామీలు..

'ప్రగతికి సోపానాలు' పేరు తో తెలంగాణ మేనిఫెస్టో ను కాంగ్రెస్ వండి వార్చింది. దీని లో పేద కుటుంబాల‌ కు ఏడాదికి నాలుగు సిలిండ‌ర్ల‌ను రూ. 500కి ఇవ్వ‌డం, ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షల సాయం, రైతుల కు, కౌలు రైతుల కు, ఎకరా కు రూ. 15000 పెట్టుబడి సాయం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, తెలంగాణ ఉద్య‌మం లో అమరులైన వారి తల్లిదండ్రుల కు రూ. 25 వేల పెన్షన్, అదేవిధంగా వారి కుటుంబాల లో ఒకరికి ఉద్యోగం కీల‌కంగా ఉన్నాయి.

అదేవిధంగా భూమి లేని నిరుపేదల కు ప్రతి ఏడాది రూ. 12000, ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు చొప్పున భ‌ర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స, వెనుకబడిన వర్గాల పైబడిన విద్యార్థినిలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత బస్సు సౌకర్యం, ఎలక్ట్రిక్ స్కూటీ (మహిళలకు), ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికీ కనిస పెన్షన్ 5000 ఇచ్చే విధంగా మేనిఫెస్టో ను రూపొందించారు.