Begin typing your search above and press return to search.

ఈ పాయింట్‌ లో కేసీఆర్ దొరికిపోయే చాన్సే ఎక్కువ‌ట‌

By:  Tupaki Desk   |   14 March 2018 4:26 AM GMT
ఈ పాయింట్‌ లో కేసీఆర్ దొరికిపోయే చాన్సే ఎక్కువ‌ట‌
X
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్‌ ల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దు చేయడం అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయడం - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలను సెషన్‌ ముగిసేదాక సస్పెన్షన్ల వ్యవహారంలో కాంగ్రెస్ నేత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌మ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయించార‌ని ఆరోపిస్తోంది. అందుకే కేసీఆర్‌ పై ఎదురుదాడికి దిగాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ ఘటనపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు మరింత దూకుడు పెంచాలని నిర్ణయించింది. న్యాయ‌ప‌ర‌మైన అంశాల ఆధారంగా పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ కోణంలో కేసీఆర్ బుక్ అవ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.

ఎమ్మెల్యేల స‌భ్యత్వాల ర‌ద్దును కాంగ్రెస్‌ అస్త్రంగా మార్చుకుంటోంది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు చేయాల‌ని డిసైడ్ అయింది. ప్రభుత్వం అన్యాయంగా తమ ఎమ్మెల్యేల‌ సభ్యత్వాలను రద్దు - సస్పెన్షన్ల తదితర అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ 48 గంటలపాటు 'ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహారదీక్ష' చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్‌ హటావో - తెలంగాణ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఇంకోవైపు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఇదే అంశంపై బుధవారం ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కోర్టుకు సమర్పించాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది.

శాసనసభలో సభ్యుల ప్రవర్తన, ఇతరత్రా అంశాలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అది కూడా ఒక్క రోజుకు మాత్రమే. ఆ చర్య తీసుకో వడానికి సభ అనుమతి అవసరం లేదు. సభ్యుల ప్రవర్తన ఆధారంగా స్పీకర్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అది కూడా పరిమితులకు లోబడే. అంతకుమించి చేయడా నికి లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా కాంగ్రెస్ నేత‌లు గులాబీ ద‌ళ‌ప‌తిని ఫిర్యాదు చేయ‌నున్నట్లు స‌మాచారం.