Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ టికెట్ ఫైట్ ఢిల్లీకి..

By:  Tupaki Desk   |   12 Nov 2018 3:40 PM IST
కాంగ్రెస్ టికెట్ ఫైట్ ఢిల్లీకి..
X
కాంగ్రెస్ లెక్క తేలడం లేదు. నామినేషన్ల పర్వానికి ఈసీ పచ్చ జెండా ఊపినా.. ఇంకా టికెట్ల కేటాయింపు జరగడం లేదు. టికెట్ దక్కని నేతలు గాంధీ భవన్ ఎదుట రచ్చ చేస్తున్నారు. అయినా కరుణించని నేతలు ఇప్పుడు ఢిల్లీ గడప తొక్కేందుకు పయనమవుతున్నారు.

గాంధీభవన్ నుంచి ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారుతోంది. ఢిల్లీలోని స్క్రీనింగ్ కమిటీ వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. దానిలో భాగంగానే సోమవారం ఢిల్లీలోని రాహుల్ నివాసానికి లంబాడీ మహిళతో కలిసి బస్సులో బయలు దేరి వెళ్లారు మాజీ ఎంపీ రవీంద్రనాయ్. తనకు దేవరకొండ టికెట్ ఇవ్వాలని రాహుల్ ను డిమాండ్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ - కుంతియా - రాహుల్ భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కానీ ఇప్పటికే బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత మణెమ్మ రాహుల్ నివాసం వద్ద ఫ్లకార్డులు పట్టుకొని ప్రదర్శనకు దిగారు. ఆమె నాగర్ కర్నూల్ సీటును అడుగుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోసం సీనియర్ నేత విజయరామారావు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ నుంచి టికెట్ ఆశిస్తున్న అశోక్ గౌడ్ సైతం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు.

ఇలా కాంగ్రెస్ సీట్ల రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఢిల్లీకి చేరింది. సీట్ల కోసం ఏకంగా రాహుల్ వద్ద ప్రదర్శన చేయడానికి నేతలు రెడీ అయ్యారు.