Begin typing your search above and press return to search.
రేవంత్ కోసం కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు వేసేశారు
By: Tupaki Desk | 21 Oct 2017 10:19 AM GMTతెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న సిగ్నల్ ఇచ్చి కలకలంం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ...ఆయన చేరిక ఖాయమైందని ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ లో ఓ ఫ్లెక్సీ వెలిసింది.
దీపావళి నేపథ్యంలో పార్టీ నేతలు ఫ్లెక్సీలు వేయడం సహజం అందులో పార్టీ నేతల చిత్రాలు ఉంచడం కూడా అంతే సహజం. కానీ వరంగల్ కు చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి - ఓర్సురాజు ఓ అడుగు ముందుకు వేశారు. దీపావళి శుభాకాంక్షల ఫ్లెక్సీలో రేవంత్ ఫోటోను స్పష్టంగా ఉంచారు. వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు రేవంత్ ఫొటో ప్రధానంగా ముద్రించిన ఫ్లెక్సీని వరంగల్ నగరంలో హన్మకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద ఏర్పాటు చేశారు. రేవంత్ ఇంకా పార్టీలోకి చేరకముందే..ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఆసక్తికరంగానే కాదు..కలకలంగా మారింది.