Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్+ కేసీఆర్ = భారత రాజకీయాలు.. కుదిరేనా..?
By: Tupaki Desk | 26 Dec 2022 2:53 AM GMTసమ ఉజ్జీలుగా ఉన్న నాయకులు కలిసి పనిచేసేందుకురెడీ అయితే.. ఏం జరుగుతుంది? ఒకే ఒరలో రెండు కత్తులు ఇమిడుతా యి.. అని చెప్పినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎవరికి వారు తోపులు. ఎవరికివారు ప్రజా మోదం పొందిన వారు.. ఎవరికి వారు బలమైన గళం, బలగం ఉన్నవారు. మరి ఇలాంటప్పుడు.. ఇద్దరూ కలిసి పనిచేయడం.. సాధ్యమేనా? అంటే.. సాధ్యమనే సంకేతాలు ఇస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇక్కడ ఇద్దరికీ ఉమ్మడి శతృవు.. ప్రధాని మోడీ. ఈయనను ఓడించడం.. భారత్‌లో ఆయన ప్రాభవాన్ని దించడమే వీరి లక్ష్యం.
అందుకే ఇద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. తన ప్రాంతీయ పార్టీని బీఆర్ ఎస్‌గా మారుస్తూ.. జాతీయ స్థాయిలో యుద్ధానికి కేసీఆర్ రెడీ అయ్యారు. ఇక, ఇప్పటికే కేంద్రస్థాయిలో సమరం చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కేసీఆర్‌తో చేతులు కలిపి.. మోడీపై యుద్ధానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. గతంలోనూ పశ్చిమ బెంగాల్ సీఎం.. మమతా బెనర్జితో చేతులు కలిపిన తమిళనాడు అప్పటి సీఎం జయలలిత కూడా ఇలానే చెప్పారు. కానీ, ఇవి వర్కవుట్ కాలేదు. కానీ, ఇప్పుడు వీరు చేస్తామని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరి ప్లస్‌లు ఏంటి? ఎవరి మైనస్‌లు ఏంటి అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రిని తీసుకుంటే.. ఈయన దక్షిణాది రాజకీయ నాయకుడు అంటే.. పొలిటికల్ హీరో అనే చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో ఈయనకు రాజకీయం చేయడం కొట్టిన పిండి. కానీ, ఉత్తరాదిలో బలమైన పార్లమెంటు స్థానాలు ఉన్న యూపీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈయనకు పెద్దగా పరిచయం లేదు. సో.. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈయన రాజకీయాలు చేయగలరు.
ఇక, కేజ్రీవాల్ విషయాన్ని చూస్తే.. ఈయనకు ఉత్తరాదిలో మంచి పేరుంది. అంతేకాదు.. ఢిల్లీ సహా పంజాబ్‌లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేసమయంలో గుజరాత్‌లోనూ సత్తా చాటుకుని 6 శాతం ఓట్లు సంపాయించుకుని 5 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు. అయితే.. ఈయనకు, కేసీఆర్ కు యూపీ మాత్రం ఇంకా కామన్‌గా టచ్‌లోకి రాలేదు. అయితే.. కేజ్రీవాల్ కూడా కేసీఆర్ మాదిరిగానే మాటకారి. సో.. రాజకీయంగా ఒకరు ఉత్తరం.. మరొకరు దక్షిణంలో పట్టు ఉన్న నాయకులే.
కలిసి పనిచేస్తే..
ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన సత్తా నిరూపించుకునే నాయకులు అయినా.. ఇప్పుడు ఉమ్మడి శత్రువు మోడీని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు.అదే సమయంలో ఇద్దరి లక్ష్యంకేంద్ర పీఠమే. అంటే.. ప్రధాని పదవే. సో.. ఇద్దరూ కనుక అటు నుంచి ఒకరు ఇటు నుంచి మరొకరు నరుక్కుని వచ్చి.. కేంద్రంలో సత్తా చాటేందుకు రెడీ అయితే.. కేంద్రంలోని ప్రధాని పీఠం ఎవరికి దక్కుతుంది? అనేది ప్రశ్న. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసుకుని.. సమయం పెట్టుకుని.. పదవి ని పంచుకోవడం మినహా.. మరో గత్యంతరం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.