Begin typing your search above and press return to search.
బీయారెస్ సభ్యత్వం తీసుకుంటే గులాబీ బాస్ గిఫ్ట్
By: Tupaki Desk | 26 Dec 2022 2:48 AM GMTపండుగలకు వ్యాపార వర్గాలు ఆఫర్స్ ప్రకటిస్తూంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి పోటాపోటీగా సాగుతున్న రాజకీయాల్లో జనాలను పట్టుకుని తమ వైపునకు తిప్పుకోవడం చాలా కష్టంగా మారుతోంది. దాంతో పార్టీ అధినాయకత్వాలు కాలానికి అనుగుణంగా కూత్త కొత్త మెదడ్స్ ని అనుసరిస్తున్నాయి.
ఇక ఏపీలో బీయారెస్ ని విస్తరించాలని కేసీయార్ చూస్తున్నారు. కేసీయార్ ఆశలన్నీ ఏపీ మీదనే ఉన్నాయి. ఏపీలో కేసీయార్ తాత ముత్తాలు ఉన్నరని చెబుతారు. తెలంగాణా ఉద్యమ వేళ అది మైనస్ అవుతుందనుకుని కోరి మరీ ఏపీకి చెందిన వారు రచ్చ చేశారు. కానీ అలా జరగలేదు. కానీ ఇపుడు అదే బీయారెస్ ఏపీలో అడుగుపెట్టేందుకు కాళ్ళూనుకేందుకు కారణం అవుతోంది.
కేసీయార్ పూర్వీకులు బొబ్బిలి వాసులు అని చెబుతారు. సో ఉత్తరాంధ్రాలో అలా కేసీయార్ బీయారెస్ కి పట్టు దొరికేసినట్లే అంటున్నారు. ఒక కేసీయార్ సామాజిక వర్గం బలంగా ఉన్న కోస్తా జిల్లాల నుంచి పలుకుబడి వర్గాలు, హైదరాబాద్ లో ఉన్న బిగ్ షాట్స్ బలమైన సామాజిక వర్గాలు ఉన్న రాయలసీమ ఇలా కొన్ని లెక్కలు అంచనాలు పెట్టుకుని మరీ కేసీయార్ ఏపీలో స్టెప్ వేయబోతున్నారు.
ఏపీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి ముహూర్తాన్ని కూడా కేసీయార్ నిర్ణయించారని అంటున్నారు. సంక్రాంతి తరువాత మాఘమాసంలో మంచి రోజు చూసుకుని అమరావతి పరిసర ప్రాంతాలలో బ్రహ్మాండమైన భవనంలో ఏపీ బీయారెస్ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఆ పనులు అన్నీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చూస్తున్నారు. ఇక కేసీయార్ జనవరి నెలలో ఏపీకి వచ్చి పార్టీ ఆఫీస్ ని ప్రారంభించడం ద్వారా తన జాతీయ పార్టీ ఎంట్రీని చాటుకుంటారు అని అంటున్నారు
మరో వైపు చూస్తే బీయారెస్ లో సభ్యత్వం తీసుకుంటే వారికి ఉచిత బీమాను అందించాలని పార్టీ నిర్ణయించిందట. ఈ విధానం ఇపుడు తెలంగాణాలో అనుసరిస్తున్నారు. ఆ అవకాశాన్ని ఏపీకి కూడా ఇవ్వాలని బీయారెస్ పెద్దలు చూస్తున్నారు. అందుకోసం 9491015222 అనే మొబైల్ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ నంబర్ కి ఫోన్ చేసి బీయారెస్ మెంబర్ షిప్ తీసుకున్న వారందరికీ బీమా ఉచితంగా చేస్తారు.
ఇక ఇప్పటికే ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభిచిన కేసీయార్ తరువాత అడుగులు ఏపీ వైపే అంటున్నారు. పార్టీ ఆఫీస్ సందర్భంగా కేసీయార్ మీడియాతో మాట్లాడుతారు అని తెల్సుతోంది. మరి ఆయన ఏపీకి సంబంధించి అజెండాను ఎలా ప్రకటిస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు. ఏపీ ప్రజల సమస్యల మీద ఆయన ఆలోచనలు ఏమిటి అన్నవి తెలుస్తాయని అంటున్నారు.