Begin typing your search above and press return to search.

వారిని క‌దిలించ‌లేక పోయిన కేసీఆర్‌.. ఇలా అయితే క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   30 Oct 2022 9:30 AM GMT
వారిని క‌దిలించ‌లేక పోయిన కేసీఆర్‌.. ఇలా అయితే క‌ష్ట‌మేనా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుట్టూ ఇప్పుడు అనేక సందేహాలు ముసురుకున్నాయి. అనేక అనుమానపు చూపులు ఆయ‌న‌ను వెంటాడుతున్నా యి. జాతీయ స్థాయిలో మెరుస్తాన‌ని.. తెలుగు వారి స‌త్తా చాటుతాన‌ని ప్ర‌క‌టించిన(అంత‌ర్గ‌తంగానే అయినా) కేసీఆర్ ఒక మెరుపు మెరిశారు. ఆయ‌న‌ను తెలుగు మీడియా స‌హా కొన్ని జాతీయ మీడియాలు కూడా మోశాయి. మోడీకి ప్ర‌త్యామ్నాయం దొరికింద‌ని, మాట‌ల మాంత్రికుడు.. ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌గ‌ల నాయ‌కుడు జాతీయ‌స్థాయిలో పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు మోడీని ఢీకొట్టే నాయ‌కుడు, ఆయ‌న‌కు దీటుగా కామెంట్ల‌తోను, మాట‌ల‌తోనూ మెప్పించ‌గ‌ల నాయ‌కుడు లేద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం. వ్య‌తిరేక‌త‌ను కూడాత‌న‌కు అనుకూలంగా మార్చుకున్న మోడీకి సాటిలేని నాయ‌కుడు లేనందుకే 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నార‌నే చ‌ర్చ‌కూడా అప్ప‌ట్లో సాగింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో నేనున్నానంటూ.. చెయ్యెత్తిన తెలుగోడుగా కేసీఆర్‌కు స‌హ‌క‌రించేందుకు తెర‌చాటున అనేక మంది చేతులు క‌లిపార‌నేది వాస్త‌వం.

రాష్ట్రంలో ఎలా ఉన్నా కేంద్రంలో మ‌నోడు ఉన్నాడ‌నే ధీమా ఉంటుందంటూ.. అనేక మంది పారిశ్రామిక దిగ్గ‌జాలు కూడా ఆయ‌న వెంట న‌డిచేందుకు ఢిల్లీలోనే చ‌ర్చ జ‌రిగింది. ఇక‌, పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది మాజీ సీఎంలు, సీఎంలు కూడా కేసీఆర్ వెంట న‌డిచేందుకు రెడీ అయ్యారు. ఇది అంతో ఇంతో పుంజుకుని, మోడీకి చెక్ పెడ‌తార‌ని.. క‌నీసం ఇప్పుడు కాక‌పోతే మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా స‌త్తా చాటుతార‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వెలుగు చూసిన ఫామ్ హౌజ్ ఉందతం.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు ఇప్పుడు కేసీఆర్‌పై అనుమానాల‌ను పెంచుతున్నాయి.

ఇంత జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు మేమున్నామంటూ.. కేసీఆర్ చుట్టూ చేరిన సీఎంలు కానీ, పార్టీల అధినేత‌లు కానీ, మాజీ ముఖ్య‌మంత్రులు కానీ ఒక్క‌రంటే ఒక్క‌రు నోరు విప్ప‌లేదు. ఒక్క క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి మాత్ర‌మే కొంత మాట్లాడినా ఆయ‌న కూడా ఏం జ‌రిగిందో పూర్తిగా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు. అంటే.. ఈ విష‌యంలో కేంద్రంపై దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని, త‌ను పైచేయి సాధించి, బీజేపీ ఫిరాయింపుల రాజ‌కీయాల‌ను ఢిల్లీ వేదిక‌గా ఎండ‌గ‌ట్టి.. మోడీని మాన‌సికంగా ఇరుకున ప‌డేయాల‌ని అనుకున్న కేసీఆర్‌కు వారెవ‌రూ క‌లిసి రాలేదు.

క‌నీసం మోడీతో ఢీ అంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ, మోడీని గ‌ద్దెదింపుతాన‌న్న దీదీ(ప‌శ్చిమ బెంగాల్ సీఎం)ని కానీ, మోడీ విధానాలు దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయ‌న్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను కానీ, మోడీ ఈ దేశాన్ని అమ్మేసినా ఆశ్చ‌ర్యం లేద‌న్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కానీ... కేసీఆర్ క‌దిలించ‌లేక పోయారు. ఈ ప‌రిణామాలేమీ.. నోటితో ఉఫ్ అంటే ఎగిరిపోయేవి కాదు. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు పునాదులు వేసుకుంటున్న ప్ర‌స్తుత స‌మ‌యంలో కేసీఆర్ బేల‌త‌నాన్ని ప‌ట్టి చూపుతున్న‌వే న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.