Begin typing your search above and press return to search.

మునుగోడు పోరు: కేసీఆర్ తొలి విజ‌యం..ఇదే!

By:  Tupaki Desk   |   10 Oct 2022 1:30 AM GMT
మునుగోడు పోరు: కేసీఆర్ తొలి విజ‌యం..ఇదే!
X
మునుగోడు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌.. ఆదిశ‌గా ప‌క్కా వ్యూహం తో ముందుకు సాగుతోంది. పార్టీ ప‌రంగా ఎంత చేసినా.. ప్ర‌జ‌ల‌ను క‌లిసినా.. అసంతృప్త నేత‌ల‌ను సంతృ ప్తి ప‌ర‌చాల‌నేది కేసీఆర్ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో ముందుగా.. అసంతృప్త నేత‌ల‌పై టీఆర్ ఎస్ అధినేత దృష్టి పెట్టారు. స్థానిక నాయకులందరినీ ఇప్పటికే బుజ్జగించగా.. టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, క‌ర్నాటి ప్ర‌భాక‌ర్‌ను సైతం లైన్‌లో పెట్టారు.

పార్టీ జాతీయ స్థాయిలో ఉద్య‌మించేందుకు రెడీ అయిన నేప‌థ్యంలో భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని.. కేసీఆర్ వారికి హామీ ఇచ్చిన‌ట్టు తెలిసిందే. అదేస‌మ‌యంలో స్థానికంగా.. వారికి ఉన్న స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించేందుకు నిధులు కూడా కేటాయిస్తామ‌ని.. హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ప‌ర‌ష్కారం కోసం.. కేటీఆర్‌కు బాధ్య‌త అప్ప‌గించిన‌ట్టు తెలిసింది. దీంతో కీల‌క‌మైన ఈ ముగ్గురు శాంతించిన‌ట్టు తెలుస్తోంది.

కూసుకుంట్ల గెలుపు కోసం పనిచేస్తామ‌ని.. ముగ్గురు స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతోపాటు.. మునుగోడులోనే మ‌కాం వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇది కేసీఆర్ సాధించిన తొలి విజ‌యంగా చెబుతున్నారు ప‌రిశీలకు లు. ఎందుకంటే.. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. అక్క‌డ అసంతృప్తుల ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించింది. ఇది పార్టీ గెలుపుపై ప్రభావం చూపింది. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ముందుగా అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టార‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. మునుగోడులోని 2 వేల మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించారు. మొత్తం 86 మందిని ఇంచార్జిలుగా నియమించిన కేసీఆర్‌.. ఒక్కో నాయకుడు వారి సొంత నియోజకవర్గం నుంచి కనీసం 20 మందిని మునుగోడుకు పంపించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగా ఇతర నియోజకవర్గాల నాయకులు మునుగోడులో దిగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం గ్రామాల్లో వసతి, భోజనం ఏర్పాట్లు సిద్ధం చేశారు.

మ‌రోవైపు టీఆర్ ఎస్‌కు మద్దతునిస్తున్న ఉభయ వామపక్షాలైన సీపీఐ, సీపీఎం ఈ నెల 11న మునుగోడు లో బహిరంగ సభను నిర్వహించనున్నాయి. వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో ఇందులో ప్రజలకు వివరిస్తామని.. రెండు పార్టీల నాయకులు వెల్లడించ‌డం కూడా.. కేసీఆర్ వేసిన వ్యూహంలో భాగ‌మేన‌ని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొం దించారు. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ తొలి ద‌శ‌లోనే భారీ విజ‌యం న‌మోదు చేయ‌డం.. అంద‌రినీ క‌ల‌సి క‌ట్టుగా న‌డిపించ‌డంలోనూ.. ఆయ‌న స‌క్సెస్ అవుతున్నార‌ని అంటున్నారు.