Begin typing your search above and press return to search.
డిసెంబర్ 9 నాడే ఢిల్లీలో మొదలుపెడుతున్న కేసీఆర్
By: Tupaki Desk | 2 Oct 2022 11:35 AM GMTతెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తూ నాడు యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన ఘనంగా ప్రకటించింది. ఆరోజే సోనియా గాంధీ పుట్టినరోజు. ఆరోజునే తెలంగాణ ప్రకటనతో ఇది తెలంగాణను సోనియా పుట్టిన రోజు కానుకగా ఇచ్చిందని కాంగ్రెస్ వాదులు ప్రచారంలోకి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించకుండా టీఆర్ఎస్ ను గెలిపించడంతో కథ అడ్డం తిరిగింది. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యి కాంగ్రెస్ ను తెలంగాణలో తొక్కిపడేశారు.
ఇప్పుడు ఆ కలిసివచ్చిన సెంటిమెంట్ 9వ తేదీనే ఢిల్లీలో ధూందాం నిర్వహించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాసేపటి క్రితం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జాతీయ పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై సీఎం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పేరు మార్పుపై భేటీలో తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
కొడితే పీఎం అయిపోవాలి.. మోడీని గద్దెదించేయాలి.. దేశ్ కీ నేతగా కేసీఆర్ ఆవిర్భవించాలని కేసీఆర్ అడుగులు వేగంగా వేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అవే. అయితే ప్యాన్ ఇండియా లెవల్లో రాజకీయం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశయాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఈ ఢిల్లీ సభలోనే ప్రకటించి కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులను తన వైపు తిప్పుకోవడానికి యోచిస్తున్నారు.ఇదే భారీ ప్రకటనగా ఉండబోతోందని అంటున్నారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను కూడా బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అన్ని కోణాల్లో కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇటీవల ఈడీ దాడులు కూడా తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.