Begin typing your search above and press return to search.
సచివాలయం కూల్చివేతకు ముందు.. సీక్రెట్ ఆపరేషన్స్?
By: Tupaki Desk | 8 July 2020 1:10 PM GMTతెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం కట్టడానికి ఎంత పట్టుదలగా ఉందో తెలిపే ఘటనలు తాజాగా చోటుచేసుకున్నాయి. సచివాలయం కూల్చివేతను ఎంతో సీక్రెట్ గా పకడ్బందీగా.. ఏకంగా సీఎస్, డీజీపీ దగ్గరుండి అర్ధరాత్రి మొదలు పెట్టారంటే దానికి ఇస్తున్న ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కూల్చివేతకు ముందు చాలా జరిగిందని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సచివాలయాన్ని కూల్చివేసే ముందు అందులోని నల్లపోచమ్మ గుడితోపాటు.. మసీదును కూల్చాల్సిన అనివార్యపరిస్థితులు నెలకొన్నాయి. ఇది సెంటిమెంట్ రాజేసే అంశం కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే రహదారులన్నీ బంద్ చేసి.. రాకపోకలు నిలిపివేసి అర్ధరాత్రి డీజీపీ, సీఎస్ దగ్గరుండి మరీ నల్లపోచమ్మ టెంపుల్లో పెద్ద ఎత్తున హోమం నిర్వహించి ఆలయంలోని మూలవిరాట్టును అక్కడి నుంచి తరలించారట.. ఇక ముస్లిం మత పెద్దలను పిలిపించి మసీదులోని మత గ్రంథాల్ని అప్పగించి కూలగొట్టించారట.. తెల్లవారుజామున 4 గంటల వరకు రాష్ట్ర సీఎస్, రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ సచివాలయం వద్దనే ఉండి మీడియాకు, స్థానికులకు ప్రవేశం లేకుండా ఈ తంతును రాత్రి 12 గంటలకు మొదలుపెట్టి ఉదయం 4 వరకు పూర్తి చేశారట..
ప్రస్తుతం నల్లపోచమ్మ గుడి, మసీదుతోపాటు సీ బ్లాక్ భవనాన్ని 15శాతం, జీ బ్లాక్ భవనం 50శాతం, హెచ్ బ్లాక్ నార్త్.. సౌత్ లను 20శాతం మేర కూల్చారు. ఏపీ పరిధిలోని బ్లాకులను ఇంకా కూల్చాల్సి ఉంది.
భారీ ఎత్తున యంత్రాలను తీసుకొచ్చి భవనాల కూల్చివేత పనులను మొదలుపెట్టారు. మీడియాకు, కిందిస్థాయి అధికారులకు కూడా ఈ విషయం తెలియకుండా డీజీపీ,సీఎస్ లు సీక్రెట్ గా చేశారట.. కూల్చివేత ప్రక్రియ మొదలు కావడానికి కొన్ని గంటల ముందు నాలుగువైపులా కిలోమీటరు దూరాన బారికేడ్లు పెట్టి మరీ ట్రాఫిక్ ను మళ్లించి ఈ తంతు నిర్వహించారు.