Begin typing your search above and press return to search.

తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్..?

By:  Tupaki Desk   |   2 March 2023 7:24 PM GMT
తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్..?
X
పాత కాపులందరినీ అక్కున చేర్చుకునే ఎత్తుగడను కేసీఆర్ వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బలమైన నేతలు జారిపోకుండా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు.ఇప్పటికే ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పార్టీకి దూరం కాగా.. ఏ పార్టీలో చేరేది అధికారికంగా ప్రకటించలేదు. మరో సీనియర్ నేత తుమ్మలను ఇటీవలే చేరదీసిన కేసీఆర్ ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒక స్థానం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కు ఇవ్వనున్నట్టు సమాచారం. తుమ్మలను అందుబాటులో ఉండాలని కేసీఆర్ సమాచారం పంపినట్టు తెలిసింది. ఇదే సమయంలో పాలేరు నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్ షర్మిలపైనా అభ్యర్థి దాదాపు ఖరరారయ్యారు.

తుమ్మలను ఎమ్మెల్సీ చేసి పెద్దల సభకు పంపాలని కేసీఆర్ చూస్తున్నారు. తుమ్మలను రేపు హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అందుకే పదవి ఇస్తున్నట్టు సమాచారం.

అయితే ఎమ్మెల్సీ పదవిపైన తుమ్మలకు ఆసక్తి లేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలనేది తుమ్మల ఆలోచనగా చెబుతున్నారు.

తుమ్మలను ఎమ్మెల్సీని చేసి వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా పాలేరు సీటును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. తమ్మినేని పాలేరు నుంచి పోటీచేయాలని చూస్తున్నారు.

ఇక పాలేరు నుంచి షర్మిల పోటీచేయడం ఖాయమని తేలిపోయింది. షర్మిల వర్సెస్ తమ్మినేని మధ్యనే అసెంబ్లీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటు.. ఖమ్మంలో విభేదాల పరిష్కారం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.