Begin typing your search above and press return to search.
కేసీఆర్ సంచలనం.. కేంద్రం నిర్ణయం తెలంగాణలో అమలుకాదా?
By: Tupaki Desk | 17 April 2020 5:15 AM GMTకరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న మాట ప్రధాని దగ్గర నుంచి ప్రముఖులంతా చెబుతున్నదే. ఈ క్రమంలో లాక్ డౌన్ రెండో ఫేజ్ ను ఆ మధ్యనే ప్రకటించింది కేంద్రంలోనిమోడీ సర్కారు. అయితే.. రెండోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న రెండో రోజునే ఆసక్తికర ప్రకటనను చేసింది. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల్ని పాక్షికంగా సడలించాలంటూ మార్గదర్శకాల్ని విడుదల చేశారు.
ఇప్పటికే అత్యవసర సేవలకు లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వటం తెలిసిందే. వాటికి తోడుగా మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇలాంటివేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిక కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కేంద్రం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ రిలీఫ్ మార్గదర్శకాల్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ మహానగరంతో పాటు.. మరికొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల్ని అమలు చేయకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 20న కంటైన్ మెంట్ లేని ప్రాంతాల్లో పలు మినహాయింపుల అమలు అయ్యేలా కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ.. వాటిని ఫాలో అయితే.. లాభం కంటే నష్టమే ఎక్కువన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ గొలుసు తెంచాలంటే లాక్ డౌన్ ను పాటించటానికి మించింది మరొకటి లేదని అందరూ ఘంటాపథంగా చెబుతున్న వేళ.. మార్గదర్శకాల పేరుతో నిబంధనల్ని సడలిస్తే.. వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందన్న ఆందోళనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
వైరస్ వ్యాప్తిపై తనకున్న అంచనాలతో పాటు.. ఇటీవల నమోదవుతున్న గణాంకాల నేపథ్యంలో లాక్ డౌన్ ఇప్పటి మాదిరే ఈ నెల 20 తర్వాత కూడా అమలు చేయాలన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను ఈ రోజు (శుక్రవారం) వెలువడుతుందంటున్నారు.